ప్రాజెక్ట్-కే.. ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న మోస్ట్ వాంటెడ్ సినిమాల్లో ఒకటి. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యధికంగా రూ.500 కోట్లకు పైగా బడ్జెట్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీని హీరో (ప్రభాస్), డైరెక్టర్ (నాగ్ అశ్విన్), ప్రొడ్యూసర్ (అశ్వినీదత్).. వీళ్లంతా మన వాళ్లే కావడం, ఇది ప్రాథమికంగా తెలుగులో తెరకెక్కుతున్న సినిమా కావడం మనకు గర్వ కారణం. టాలీవుడ్ గర్వించదగ్గ ‘ఆదిత్య 369’ స్ఫూర్తితో ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కలగలిపి ఈ సినిమా తీస్తున్నాడు నాగ్ అశ్విన్. ‘ఆదిత్య 369’ రూపకర్త సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రానికి మెంటర్‌గా వ్యవహరిస్తుండడం విశేషం.
దాదాపు రెండేళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన ప్రి ప్రొడక్షన్ వర్క్ తర్వాత గత ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లింది. ప్రభాస్‌కు వీలు చిక్కినపుడల్లా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. ఇందులో బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే ముఖ్య పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.
ఇప్పటిదాకా సినిమా నుంచి కనిపించీ కనిపించని లుక్సే బయటపెట్టింది చిత్ర బృందం. అమితాబ్ బచ్చన్, ప్రభాస్‌ల చేతులను మాత్రమే చేపిస్తూ చిన్న గ్లింప్స్ లాంటివి చూపించారు. ఇప్పుడు దీపికా పదుకొనే లుక్‌ను కూడా ఇలాగే పరిచయం చేశారు. గురువారం దీపిక పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో దీపిక ముఖం చూపించకుండా ఆమె లుక్‌ను రిలీజ్ చేయడం విశేషం. ఔట్ లుక్ చూస్తే హాలీవుడ్ సూపర్ ఉమన్ పాత్రలు గుర్తుకొస్తున్నాయి.
‘ఎ హోప్ ఇన్ ద డార్క్’ అనే క్యాప్షన్ పెట్టడం ద్వారా.. ఆమెది ఒక యోధురాలి పాత్రే అనే విషయం అర్థమవుతోంది. సినిమా హాలీవుడ్ రేంజికి ఏమాత్రం తగ్గకుండా ఉంటందనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తోంది. హీరోయిన్‌కే ఇంత బిల్డప్ అంటే.. ఇక హీరోకు ఏ రేంజిలో ఉంటుందో అనే చర్చ నడుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశముంది.
This post was last modified on January 5, 2023 2:40 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…