పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఖుషి, గుడుంబా శంకర్, బాలు, తీన్ మార్ లాంటి అదిరిపోయే ఆడియోలు ఇచ్చిన సంగీత దర్శకుడు మణిశర్మ. ఖుషి మినహా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆడకపోయి ఉండొచ్చు కానీ.. వాటి ఆడియోలను మాత్రం తక్కువ చేయలేం. ఐతే ఈ సినిమాల ఆడియోలు అంత బాగా రావడానికి పవన్ కూడా ఒక కారణమని అంటున్నాడు మణిశర్మ.
తాజాగా ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పవన్‌తో తన అనుబంధం.. పవన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ అనుభవం గురించి మాట్లాడాడు. తాను పని చేసిన వాళ్లలో పవన్ అంత మ్యూజిక్ సెన్స్ ఉన్న, అంతలా సంగీత చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యే హీరో మరొకరు కనిపించలేదని మణిశర్మ పేర్కొనడం విశేషం.
పవన్, తన కాంబినేషన్ అనగానే అందరికీ ఖుషి సినిమానే గుర్తుకొస్తుందని.. కానీ గుడుంబా శంకర్ ఆడియో ఖుషిని మించి ఉంటుందని.. అందులో రకరకాల పాటలుంటాయని.. అన్నీ చాలా బాగుంటాయని మణిశర్మ అన్నాడు.
ఈ సినిమాకు ట్యూన్స్ కంపోజ్ చేసేటపుడు పవన్ తనతోనే ఉన్నాడని.. తాను ట్యూన్స్ చేసుకుంటుంటే.. పక్కనే నేల మీద కార్పెట్ వేసుకుని పడుకునేవాడని.. ఏదో పుస్తకం చదువుకుంటూ ఉండేవాడని.. తాను ఏదైనా ట్యూన్ వినిపిస్తే అది నచ్చగానే ఎగిరి గంతేసినంత పని చేసేవాడని.. పవన్‌కు పది కోట్ల చెక్కు చేతికిస్తే ఏ ఎమోషన్ లేకుండా మామూలుగా ఉంటాడని.. కానీ మంచి ట్యూన్ వస్తే మాత్రం చిన్నపిల్లాడిలా ఎగిరి గంతులేస్తాడని.. అదీ ఆయన వ్యక్తిత్వం అని మణిశర్మ అన్నాడు.మళ్లీ పవన్‌తో పని చేయాలని ఉందని.. కానీ అది తన చేతుల్లో లేదని.. అది నిర్ణయించాల్సింది పవన్ అని మణిశర్మ అన్నాడు.
This post was last modified on July 20, 2020 11:18 am
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అతిథిగా వచ్చిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చిన్నపాటి బాంబు పేల్చారు. ఇప్పటిదాకా…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో ఆదివారం జరిగిన జనసేన బహిరంగ సభ…
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…