టాలీవుడ్లో చాలామంది టాప్ స్టార్లతో సినిమాలు చేశాడు దిల్ రాజు. చిరంజీవి, బాలకృష్ణలను మినహాయిస్తే దాదాపుగా అందరు స్టార్లూ ఆయనతో సినిమాలు చేశారు. ఆ ఇద్దరు కూడా ఏదో ఒక రోజు రాజుతో జట్టు కట్టకపోరన్న అంచనాలున్నాయి. పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలన్న తన కలను కూడా ‘వకీల్ సాబ్’తో నెరవేర్చుకున్నాడు రాజు. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ లాంటి టాప్ స్టార్‌తో శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతోంది.
ఇదే టైంలో రాజు టైం వేరే భాషల వైపు మళ్లింది. హిందీలో ఏడాది వ్యవధిలో రెండు సినిమాల నిర్మాణంలో పాలుపంచుకున్నాడు. తమిళంలో విజయ్ లాంటి టాప్ స్టార్‌తో ‘వారసుడు’ చేశాడు. ఇప్పుడాయన దృష్టి ఓ కన్నడ స్టార్ మీద పడ్డట్లు సమాచారం.
‘కేజీఎఫ్’తో పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఇమేజ్ సంపాదించిన యశ్‌తో ఓ సినిమా చేయడానికి దిల్ రాజు గట్టిగా ప్రయత్నిస్తున్నాడట. ‘కేజీఎఫ్: చాప్టర్-1’ తర్వాత గ్యాప్ వచ్చినా.. పక్క చూపులు చూడకుండా ‘కేజీఎఫ్-2’తోనే ప్రేక్షకులను పలకరించాడు యశ్. ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవడంతో అతడి రేంజే మారిపోయింది. ఐతే దీని తర్వాత తన ఇమేజ్‌ను మ్యాచ్ చేసే కథ, దర్శకుడి కోసం అతడి వేట సాగుతోంది. ఇదిగో అదిగో అంటున్నారే తప్ప యశ్ కొత్త సినిమా ఎంతకీ ఒక కొలిక్కి రావడం లేదు. ప్రశాంత్ నీల్ లాగా తన ఇమేజ్‌ను మ్యాచ్ చేసే, పెంచే మరో దర్శకుడు కన్నడలో లేక యశ్ ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.
ఐతే యశ్ తన తర్వాతి సినిమా విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడో కానీ.. దిల్ రాజు అయితే అతడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక పాన్ ఇండియా సినిమా చేయడానికి కమిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. యశ్ కోసం కథ, దర్శకుడి వేటలో రాజు బిజీగా ఉన్నాడట. మామూలుగా రాజు కథ రెడీ చేసుకున్నాకే హీరోలను కలుస్తుంటాడు. కానీ యశ్ విషయంలో మాత్రం ముందు అడ్వాన్స్ ఇచ్చి కమిట్మెంట్ తీసుకుని.. తర్వాత కథ, దర్శకుడి మీద దృష్టిపెట్టినట్లు సమాచారం.
This post was last modified on January 4, 2023 2:32 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…