మామూలుగా ఫిబ్రవరి అంటే చాలా డల్ సీజన్ అనే అభిప్రాయం ఉండేది ఒకప్పుడు. ఆ టైంలో చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజయ్యేవి కావు. సంక్రాంతి తర్వాత ఫిబ్రవరిలో డల్‌గా మారే బాక్సాఫీస్.. మళ్లీ మార్చి నెలాఖర్లో కానీ ఊపందుకోదు. సినిమాలకు మహ రాజ పోషకులైన యువతలో చాలామంది ఈ టైంలో పరీక్షలతో బిజీగా ఉంటారు. కాలేజీ స్టూడెంట్స్ అంతా పరీక్షలకు సిద్ధమవుతుంటారు కాబట్టి సినిమాలకు వసూళ్లు ఉండవు. ముఖ్యంగా ఫిబ్రవరి సగం నుంచి మార్చి మూడో వారం వరకు డ్రై రన్ అన్నట్లే. అందుకే ఆ టైంలో పేరున్న, పెద్ద సినిమాలు విడుదల చేయరు. చాలా వరకు చిన్నా చితకా సినిమాలకు క్లియరెన్స్ టైం లాగా ఉపయోగపడుతుంటుంది ఈ ఈ సీజన్.
కానీ కరోనా టైం నుంచి చదువులు, పరీక్షల షెడ్యూళ్లు తేడా కొట్టేయడంతో సినిమాల వ్యవహారం కూడా మారిపోయింది. 2021, 2022లో ఫిబ్రవరిలోనే పేరున్న సినిమాలు రిలీజయ్యాయి. మంచి వసూళ్లు కూడా సాధించాయి.
ఇప్పుడు కరోనా ప్రభావం లేదు. పరీక్షలు యధావిధిగా జరుగుతున్నాయి. అయినా సరే ఫిబ్రవరిలో మ్యాడ్ రష్ కనిపిస్తోంది. నవంబరు-డిసెంబరు నెలల్లో రిలీజ్ కావాల్సిన సినిమాలను కూడా వాయిదా వేసి మరీ ఫిబ్రవరి విడుదలకు ఫిక్స్ చేయడం విశేషం. ఇప్పటికే శివరాత్రి వీకెండ్‌లో ధనుష్ ద్విభాషా చిత్రం ‘సార్’.. విశ్వక్సేన్ మూవీ ‘ధమ్కీ’.. కిరణ్ అబ్బవరం సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. కొత్తగా సమంత సినిమా ‘శాకుంతలం’ను అదే వీకెండ్‌కు ఖరారు చేశఆరు. ఇక నెల ఆరంభంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా ‘అమిగోస్’ రాబోతోంది.
సంక్రాంతికి అనుకుని మళ్లీ వాయిదా పడ్డ ‘ఏజెంట్’ సినిమా కూడా ఫిబ్రవరిలోనే ప్రేక్షకులను పలకరిస్తుందని అంటున్నారు. తాజాగా మరో చిత్రం ఫిబ్రవరి రేసులోకి వచ్చింది. డిసెంబరు నెలాఖరులో రావాల్సి ఉండి, వాయిదా పడ్డ సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ ‘మైకేల్’ను ఫిబ్రవరి 3కు ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి తొలి, మూడో వారాలకు ప్యాక్ అయిపోగా.. మిగతా రెండు వారాల్లోనూ మూణ్నాలుగు పేరున్న సినిమాలే షెడ్యూల్ కావడం ఖాయం.
This post was last modified on January 3, 2023 10:49 pm
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…
భారత్, పాకిస్థాన్ మరోసారి ఫైనల్‌లో తలపడబోతున్నాయి. ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్ గోల్డ్ మెడల్ కోసం శనివారం రెండు జట్లు…