బ్లాక్ బస్టర్ ఫస్ట్ సిరీస్ తర్వాత సెకండ్ సీజన్ తొలుత కొంచెం డల్ గా అనిపించినా ప్రభాస్ రాకతో అన్ స్టాపబుల్ షోకి ఎక్కడలేని ఊపొచ్చింది. ఏకంగా ఆహా యాప్ గంటల తరబడి క్రాష్ అయ్యే రేంజ్ లో బాలయ్య టాక్ షో అదరగొట్టేసింది. ఇంకా అసలైన రెండో భాగం ఈ శుక్రవారం స్ట్రీమింగ్ కానుండగా దాని మీదా అంచనాలు అంతకు మించి అనేలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తో దీనికి బ్రేక్ ఇవ్వబోతున్నారని ఆల్రెడీ టాక్ ఉండగా దాన్ని ఈ నెలాఖరుకు విడుదల చేసే ప్రణాళిక ఉన్నట్టు ఆహా టీమ్ ప్రకటించేసింది. ఇక్కడితో కథ అయిపోలేదు. మరో సర్ప్రైజ్ గెస్ట్ రాబోతున్నారని లేటెస్ట్ అప్ డేట్.
ఈ నెల 13 విడుదల కాబోతున్న వీరసింహారెడ్డి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాంని అన్ స్టాపబుల్ టీమ్ ప్లాన్ చేసింది. దానికి దర్శకుడు గోపీచంద్ మలినేని, తమన్ హాజరు కాబోతున్నారు. హీరోయిన్ శృతి హాసన్ రావడంలో ఆశ్చర్యం లేదు కానీ ఆమెతో పాటు తండ్రి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా గెస్ట్ గా స్వీట్ షాక్ ఇవ్వొచ్చని వినికిడి. ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఆ దిశగా నాన్నను ఒప్పించేందుకు శృతి బాధ్యత తీసుకున్నట్టుగా తెలిసింది. ఎలాగూ కమల్ కు బిగ్ బాస్ షో హోస్ట్ చేయడం ద్వారా ఇలాంటివి కొత్తేమి కాదు. పైగా కూతురి సినిమా కాబట్టి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు.
బాలయ్య కమల్ లకు ముందు నుంచి అనుబంధం ఉంది. ఆదిత్య 369కి సింగీతం శ్రీనివాసరావు ముందు కమల్ హాసన్ నే అనుకున్నారు. కానీ అప్పుడా టైంలో క్షత్రియ పుత్రుడు పనుల్లో బిజీగా ఉండటంతో ఇద్దరూ కలిసి బాలకృష్ణనే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యారు. ఒకవేళ కమల్ కనక ఆ సినిమాని ఒప్పుకుని ఉంటే కృష్ణదేవరాయల భాగంలో మాత్రమే నందమూరి హీరో కనిపించేవారు. ఇలాంటి ఎన్నో అరుదైన సంఘటనలు పంచుకునే అవకాశం దక్కుతుంది. మరి ఈ అరుదైన కలయిక కూడా నిజమైతే ప్రభాస్, పవన్ ల తర్వాత ఆ రేంజ్ బ్లాస్టింగ్ దీనికే ఉంటుంది. షూటింగ్ ఇంకో వారంలోనే చేయనున్నారు.
This post was last modified on January 3, 2023 10:40 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…