ఇప్పుడంటే అన్ని భాషల హీరోలూ సిక్స్ ప్యాక్‌లు చేసేస్తున్నారు కానీ.. ఒకప్పుడు అందుకు ఫేమస్ బాలీవుడ్డే. హీరోలంటే ఇలా ఉండాలి అనిపించేలా 90వ దశకంలోనే సల్మాన్ ఖాన్, సన్నీ డియోల్, సునీల్ శెట్టి లాంటి హీరోలు కండలు తిరిగిన దేహంతో అదిరిపోయే లుక్స్‌లోె దర్శనం ఇచ్చేవాళ్లు.
ఆ తర్వాత బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ప్రతి హీరోకూ సిక్స్ ప్యాక్ ఉండడం ఒక అర్హతలాగా మారిపోయింది. ఐతే బాలీవుడ్లో చాలామంది కండల వీరుల్ని చూశాం కానీ.. అందరిలోకి హృతిక్ రోషన్ చాలా స్పెషల్. తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై’లోనే కళ్లు చెదిరే దేహంతో అమ్మాయిలనే కాక అందరినీ పడేశాడు హృతిక్.
గ్రీకు వీరుడిలా కనిపించే అతను యూత్‌కు ఒక రోల్ మోడల్ అయిపోయాడు. ధూమ్-2, వార్ లాంటి చిత్రాల్లో అతడి లుక్స్‌కు అందరూ ఫిదా అయిపోయారు. వయసు పెరుగుతున్న అతడికి తన ఒంటి మీద ఏమాత్రం శ్రద్ధ తగ్గడం లేదు.
ప్రస్తుతం హృతిక్ వయసు 48 ఏళ్లు. ఈ వయసులోనూ ఏమాత్రం ఉత్సాహం తగ్గకుండా అతను తన బాడీని అన్ బిలీవబుల్ షేప్‌లోకి తీసుకొచ్చాడు. తదాజాగా జిమ్‌లో తన బాడీ మీద ప్యాక్స్ అన్నింటినీ చూపిస్తూ ఒక ఫొటో తీసుకున్నాడు హృతిక్. ఉదర భాగంలో పలకలు మామూలే కానీ.. సైడ్స్‌లో కూడా కళ్లు చెదిరే రీతిలో ప్యాక్స్ చేసి ఔరా అనిపించాడు హృతిక్.
హాలీవుడ్ హీరోలు కూడా తన ముందు దిగదుడుపు అనిపించేలా ఉన్న హృతిక్ లుక్‌కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. ఈ వయసులో ఈ లెవెల్ డెడికేషన్ హృతిక్‌కే సాధ్యం అంటూ కొనియాడుతున్నారు. గత ఏడాది హృతిక్‌కు ‘విక్రమ్ వేద’ చేదు అనుభవం మిగిల్చింది. అతడి కొత్త చిత్రం ‘ఫైటర్’ వచ్చే ఏడాది జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ యాక్షన్ మూవీ కోసమే హృతిక్ అలా బాడీ పెంచాడు.
This post was last modified on January 2, 2023 8:16 pm
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…