Movie News

ముగ్గురు టాప్ స్టార్లు.. 2023లో కనబడరు

ఒకప్పుడు స్టార్లందరూ ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేసేవారు. కృష్ణ లాంటి హీరోలైతే ఒకే ఏడాది రెండంకెల సంఖ్యలో సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కాల క్రమంలో పరిస్థితులు మారిపోయాయి. స్టార్ల నుంచి ఏడాదికి ఒక్క సినిమా రావడం కూడా గగనం అయిపోతోంది. రాజమౌళి లాంటి దర్శకులతో హీరోలు జట్టు కట్టారంటే ఏళ్లకు ఏళ్లు వారి సినిమా కోసం ఎదురు చూడాల్సింది.

ఈ మధ్య పాన్ ఇండియా ట్రెండు ఊపందుకోవడంతో వేరే దర్శకులతో పెద్ద సినిమాలు చేసినా.. బాగా టైం పట్టేస్తోంది. 2022లో నందమూరి బాలకృష్ణ, అల్లు అర్జున్ లాంటి స్టార్ల సినిమాలు లేకుండానే గడిచిపోయింది. ఈ ఏడాది టాప్ స్టార్లలో రిలీజ్ లేని హీరోలు వీళ్లిద్దరే. 2023లో ముగ్గురు హీరోలు తమ అభిమానులకు నిరాశ మిగిల్చేలా కనిపిస్తున్నారు.

2022లో ‘ఆర్ఆర్ఆర్’తో మురిపించిన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లిద్దరూ 2023లో మళ్లీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించే అవకాశాలు కనిపించడం లేదు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ ఆలస్యం చేయకుండా శంకర్‌తో సినిమాను లైన్లో పెట్టినప్పటికీ.. మధ్యలో శంకర్ ‘ఇండియన్-2’ చేయాల్సి రావడంతో ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. 2023 సంక్రాంతికే అనుకున్న సినిమా కాస్తా బాగా వెనక్కి వెళ్తోంది. 2023 అంతటా కూడా ఈ సినిమా రిలీజ్ కాదట. 2024 సంక్రాంతికే అంటున్నారు.

మరోవైపు కొరటాల శివతో తారక్‌ చేయాల్సిన సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. చివరికి ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుపెట్టి 2024 వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించారు. కాబట్టి తారక్ అభిమానులకు కూడా 2023లో నిరాశ తప్పదు. ఇక అల్లు అర్జున్ సైతం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రావడం సందేహమే. సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేస్తున్న ‘పుష్ప-2’ షూటింగ్ ఆలస్యంగా మొదలైంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో వివిధ భాషల్లో భారీ స్థాయిలో్ రిలీజ్ కావాల్సి ఉండడంతో మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కానున్నాయి. కాబట్టి ఆ చిత్రం కూడా 2023లో రిలీజ్ కాదు. కాబట్గి ఈ ముగ్గరు టాప్ స్టార్ల అభిమానులకు నిరాశ తప్పదు.

This post was last modified on January 2, 2023 2:27 pm

Share
Show comments

Recent Posts

కొత్త తరం దర్శకులతో చిరంజీవి లైనప్

తన సమకాలీకుడైన బాలకృష్ణతో పోలిస్తే చిరంజీవి సక్సెస్ రేట్ ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురైన మాట వాస్తవం. ఖైదీ నెంబర్…

23 minutes ago

అర్థం కాలేదన్న సినిమాను ఎగబడి కొంటున్నారు

కొన్ని సినిమాలంతే. మొదట్లో నెగటివ్ లేదా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటాయి. తర్వాతి కాలంలో కల్ట్ క్లాసిక్స్ గా మారిపోయి రీ…

2 hours ago

కాకినాడ పోర్టు మళ్లీ కేవీ రావు చేతికి.. డీల్ కు అరబిందో రెఢీ

గత ప్రభుత్వంలో కాకినాడ సీ పోర్టు.. సెజ్ చేతులు మారిన సంగతి తెలిసిందే. అయితే.. తన నుంచి బలవంతంగా పోర్టును…

2 hours ago

జపాన్ జనాలకు కల్కి ఎక్కలేదా

ఈ మధ్య మన తెలుగు సినిమాలు జపాన్, చైనా లాంటి దేశాల్లో బాగా ఆడుతున్నాయి. ఆర్ఆర్ఆర్ కు దక్కిన ఆదరణ…

3 hours ago

చరిత్రలో తొలిసారి: మారథాన్ లో మనిషితో రోబోలు

మానవాళి చరిత్రలో అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోనుంది. మారథాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఐదు…

3 hours ago

ఫ్యాషన్ ఐకాన్ లా నారా లోకేశ్!

నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……

3 hours ago