Movie News

Big Story 2022 డబ్బింగ్ హంగామా

ఎప్పటిలానే ఈ ఇయర్ కూడా తెలుగులో కొన్ని డబ్బింగ్ సినిమాలు సందడి చేశాయి. వాటిలో భారీ వసూళ్లు అందుకొని టాలీవుడ్ ని షాక్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి 2022 లో రిలీజై తెలుగు బాక్సాఫీస్ దగ్గర సందడి చేసిన డబ్బింగ్ సినిమాలేంటి ? ఏ రేంజ్ హిట్స్ అందుకున్నాయి చూద్దాం.

ఈ ఇయర్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్స్ లో ‘కేజీఎఫ్ 2’ ఒకటి. చాప్టర్ 1 కంటే చాప్టర్ 2 తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. సినిమాలో ఉండే ఎలివేషన్ ఎపిసోడ్స్ కి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో యష్ – ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన ఈ డబ్బింగ్ మూవీ భారీ వసూళ్లు కొల్లగొట్టింది.

2022 లో కమల్ హాసన్ నుండి వచ్చిన డబ్బింగ్ మూవీ ‘విక్రమ్ హిట్ లిస్ట్’. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన విక్రమ్ తెలుగులో బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసి మంచి లాభాలు అందుకున్నారు. విక్రమ్ తో కమల్ మంచి కం బ్యాక్ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను ఆడియన్స్ రిపీటెడ్ గా చూసి భారీ కలెక్షన్స్ అందించారు.

ఈ ఏడాది సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ హిట్ సాదించింది ‘కాంతార’. రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో బిగ్గెస్ట్ హిట్ అనిపించుకుంది. గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా తెలుగులో రిలీజైన ఈ కన్నడ డబ్బింగ్ సినిమా తెలుగు ఇండస్ట్రీకి పెద్ద షాక్ ఇచ్చే వసూళ్లు రాబట్టింది. క్లైమాక్స్ ను రిషబ్ శెట్టి డిజైన్ చేసిన విధానంతో పాటు అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. దీంతో సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు కొల్లగొట్టింది. 

ఇక ఏడాది ఆరంభంలో వచ్చిన శివ కార్తికేయన్ ‘డాన్’ సినిమాతో పాటు ధనుష్ ‘తిరు ‘ కూడా తెలుగులో మంచి కలెక్షన్స్ అందుకున్నాయి. డాన్ సినిమాలో కామెడీ క్లిక్ అయితే తిరులో తండ్రి కొడుకుల ఎమోషన్ బాగా వర్కవుట్ అయింది. ఇక కన్నడ సినిమా చార్లీ 777 కూడా తెలుగులో మంచి ప్రశంసలు దక్కించుకుంది. వసూళ్ల పరంగా మాత్రం జస్ట్ ఓకె అనిపించుకుంది. సర్దార్ తెలుగు ప్రేక్షకులను మెప్పించి ఆకట్టుకుంది. సినిమాలో ఉన్న సందేశం నచ్చడంతో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాను థియేటర్స్ లో మోస్తరుగా చూశారు. 

ఏడాది ఎండింగ్ లో వచ్చిన ‘లవ్ టుడే ‘ తెలుగు ప్రేక్షకులకి కిక్ ఇచ్చింది. సినిమాలో తీసుకున్న మొబైల్ ఎక్స్ ఛేంజ్ కాన్సెప్ట్ యూత్ కి కనెక్ట్ అవ్వడంతో మౌత్ పబ్లిసిటీతో సినిమా మూడు రోజుల పాటు మంచి కలెక్షన్స్ రాబట్టింది. 

ఇక విశాల్ సామాన్యుడు , విష్ణు విశాల్ FIR , మట్టి కుస్తీ, హే సినామిక , అలియా భట్ ‘గంగు భాయి’ విజయ్ ‘బీస్ట్’ ఇలా చాలా డబ్బింగ్ సినిమాలు ఈ ఏడాది థియేటర్స్ లోకి వచ్చాయి కానీ వీటిలో ఏ ఒక్కటి ఆశించిన విజయం అందుకోలేదు.

This post was last modified on December 31, 2022 11:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

6 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

7 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

7 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago