సౌత్ ఇండియన్ ఫిలిం స్టార్స్ చాలామంది వెబ్ సిరీస్‌లను తక్కువగా చూస్తున్నారు. వాటిలో నటించడానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. ఎక్కువగా చిన్న స్థాయి, డిమాండ్ లేని ఆర్టిస్టులే వీటిలో నటిస్తున్నారు. ఇలాంటి సమయంలో సమంత లాంటి అగ్ర కథానాయిక ధైర్యంగా డిజిటల్ ఎంట్రీకి రెడీ అయిపోయింది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ ‘ఫ్యామిలీ మ్యాన్-2’. అమేజాన్ ప్రైమ్ కోసం రాజ్-కృష్ణ ఈ సిరీస్‌ను రూపొందించారు.
‘ఫ్యామిలీ మ్యాన్’ తొలి సిరీస్ చక్కటి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. మనోజ్ బాజ్‌పేయి అందులో కథానాయకుడిగా నటించాడు. సెకండ్ సీజన్లోనూ అతనే హీరో. అతడికి భార్యగా ప్రియమణి పాత్ర ఇందులోనూ కొనసాగనుంది. మరి ఇందులో సమంత పాత్ర ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది.
ఐతే ‘ఫ్యామిలీ మ్యాన్-2’లో సమంతది నెగెటివ్ రోల్ అని.. ఆమె టెర్రరిస్టుగా కనిపించనుందని ఓ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ప్రియమణి తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఫ్యామిలీ మ్యాన్-2’లోనూ తన పాత్ర కొనసాగుతుందని.. మనోజ్‌కు భార్యనే తన క్యారెక్టర్ ఉంటుందని ఆమె చెప్పింది.
ఇక సమంత పాత్ర గురించి అడిగితే.. అది ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉంటుందని ఆమె అంది. తన పాత్రకు సంబంధించి లైన్ విన్నానని.. అది చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించిందని.. ఆ పాత్ర కోసం అందరూ ఎదురు చూడాలని అంది ప్రియమణి. ఈ వ్యాఖ్యల్ని బట్టి చూస్తే సమంత పాత్ర ఇప్పటిదాకా ఏ సినిమాలోనూ చూడని విధంగా ఉంటుందని స్పష్టమవుతోంది. లాక్ డౌన్ వల్ల కొంత పార్ట్ చిత్రీకరణ ఆగిపోయింది. త్వరలోనే అది పూర్తి చేసి ‘ఫ్యామిలీ మ్యాన్’ను ప్రేక్షకుల ముందుకు తేనున్నారు.
This post was last modified on July 20, 2020 1:20 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…