Movie News

క్లూలు ఇస్తున్న ప్రాజెక్ట్ K చక్రం

Prabhas ప్రస్తుతం చేస్తున్న ప్యాన్ ఇండియా సినిమాల్లోకెల్లా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ప్రాజెక్ట్ కె రిలీజ్ కు ఇంకా బోలెడు టైం ఉన్నప్పటికీ దర్శకుడు నాగ అశ్విన్ టీమ్ న్యూ ఇయర్ కానుకగా చిన్న వీడియో అప్ డేట్ ఇచ్చింది. అయితే ఇందులో హీరో హీరోయిన్లు ఎవరూ లేకుండా కేవలం స్క్రాచ్ నుంచి తమ సినిమా ఎలా మొదలయ్యిందన్న హింట్లు ఇస్తూ కట్ చేశారు. ముఖ్యంగా ఒక పెద్ద లారీ చక్రాన్ని డిజైన్ చేయడానికి పదుల సంఖ్యలో సభ్యులు కష్టపడటం, ఈ మాత్రం షాపులో దొరుకుతుంది కదా ఇంత పని ఎందుకని ఓ వర్కర్ తో అనిపించడం వేటికవే కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి.

కొంచెం లోతుగా గమనిస్తే ఇందులో కొన్ని విషయాలు అర్థం చేసుకోవచ్చు. Project K ముందు నుంచి ప్రచారంలో ఉన్నట్టు టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. అశ్విన్ స్టోరీ లైన్ ఎక్కడా చెప్పలేదు కానీ అప్పుడెప్పుడో వచ్చిన ఆదిత్య 369 రిఫరెన్స్ ల కోసం సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు గారిని సలహాదారుగా పెట్టుకోవడం దీనికి లింక్ అవుతోంది. అంత పెద్ద చక్రం ఏ కారణం లేకుండా సింపుల్ సీన్ కోసం తయారు చేసి ఉండరు. సో దాన్ని ఏదైనా వాహనానికి బిగించడం ద్వారానో లేదా అది ఉన్న చోట కాలం వెనక్కు ముందుకు వెళ్లడమో జరిగేలా ట్విస్టు పెట్టుంటారు.

ఇదంతా నిజమని కాదు కానీ జాగ్రత్తగా డీ కోడింగ్ చేస్తే ఇవి సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికి కేవలం కొంత భాగం మాత్రమే షూట్ పూర్తి చేసుకున్న ప్రాజెక్ట్ కె కోసం 2023లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసుకున్నారు. వైజయంతి సంస్థ దీని విడుదలని ఇంకా ఖరారు చేయలేదు కానీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం ఎంత సమయం పడుతుందనే దాని మీద రిలీజ్ డేట్ ఆధారపడి ఉంటుంది. దీపికా పదుకునే ప్రాజెక్ట్ కెతో ఇంకా పూర్తి స్థాయిలో జాయిన్ కాలేదు. చిత్రీకరణకు మొత్తం సిద్ధం చేశాక తనతో సహా అమితాబ్, అనుపమ్ ఖేర్ తదితరుల డేట్లను తీసుకోబోతున్నారు. ప్రభాస్ కాబట్టి చిన్న వీడియో అయినా సరే ఇంత చర్చ జరుగుతోంది.

This post was last modified on December 31, 2022 11:51 am

Share

Recent Posts

కారు బానెట్‌ పై ఇల్లాలు… కారు లోపల ప్రియురాలు

భర్త మరో మహిళతో కారులో కనిపించాడు. అది చూసిన భార్య వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. కానీ భర్త కారు ఆపకుండా…

1 hour ago

కుటుంబం సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి

నిన్న ఉన్నట్టుండి ఆదర్శ కుటుంబం ఏకె 47 పండగ బరి నుంచి తప్పుకుందనే వార్త సోషల్ మీడియాని ఊపేసింది. ఇంకా…

1 hour ago

రాజమౌళి రాబోయే ‘ట్రబుల్’ని గుర్తించలేదా

స్వంత కుటుంబం సినిమా. కార్తికేయ నిర్మాతగా వ్యవహరించి పక్క భాషనుంచి ఫహద్ ఫాసిల్ ని తీసుకొచ్చి తీసిన మూవీ. పైగా…

2 hours ago

ఎవరూ పట్టించుకోని ‘యుగంధర్’ పోరాటం

కొత్త సినిమా రిలీజ్ అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ప్రతిదానికి ఎంతో కొంత ఓపెనింగ్ ఇచ్చే ప్రేక్షక వర్గం…

3 hours ago

మంచి ఆలోచన చేసిన రణబాలి

దసరా పండగ సందర్భంగా విడుదల కాబోతున్న సినిమాల్లో రణబాలి మీద భారీ అంచనాలున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

14 hours ago