మెగా ఫ్యాన్స్, మాస్ మహారాజా అభిమానులు జాయింట్ గా ఎదురు చూస్తున్న పూనకాలు లోడింగ్ లిరికల్ పాటని చాలా గ్రాండ్ గా తెలుగు రాష్ట్రాల్లో పలు థియేటర్లలో రిలీజ్ చేశారు. అదే టైంకి ఆన్ లైన్ లోనూ వచ్చేసింది. హైదరాబాద్ క్రాస్ రోడ్స్ సంధ్య 70 ఎంఎం దగ్గర ఏదో విడుదల ఈ రోజే అన్నంత హడావిడి జరిగింది. ఇటీవలే వీరసింహారెడ్డిలో మా బావ మనోభావాలు సాంగ్ కి ఇదే తరహా సందడి చేయడం గుర్తే. నిర్మాతలు ఒకరే కాబట్టి అదే స్ట్రాటజీని దీనికీ ఫాలో అయ్యారు. ఆల్బమ్ మొత్తం విపరీతమైన అంచనాలు పూనకాలు మీదే ఉన్నాయి. ఇద్దరు హీరోలు కలిసి డాన్స్ చేసిన కాంబో కాబట్టి హైప్ ఉండటం సహజం
అన్నట్టుగానే విజువల్ గా పాట అదిరిపోయింది. చిరంజీవి చాలా యంగ్ గా స్మార్ట్ గా తన మార్కు స్టెప్పులతో అదరగొట్టారు. సగమయ్యాక రవితేజ ఎంట్రీ ఆపై ఇద్దరూ కలిసి ఊర మాస్ బీట్స్ కి కాలు కదపడం అంతా గూస్ బంప్స్ స్టఫ్ లాగే తోచింది. దేవిశ్రీ ప్రసాద్ వాడిన ఫ్లూట్ కంపోజింగ్ బిట్ ఆకట్టుకునేలా సాగింది. అంతా బాగానే ఉంది కానీ అసలైన ట్యూన్ మాత్రం కొంచెం హడావిడిగా బాస్ పార్టీ, వీరయ్య టైటిల్ సాంగ్ ని తలదన్నే రేంజ్ లో లేదని అనిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే తరహా అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీట్స్ అన్నీ బాగున్నాయి కానీ నాటు నాటు స్థాయి అంచనాల వల్ల వచ్చింది చిక్కిది
డిఎస్పి మాములుగా స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తాడు కాబట్టి మున్ముందు ఏమైనా రీచ్ పెరుగుతుందేమో చూడాలి. ఇప్పటిదాకా వచ్చిన నాలుగు పాటల్లో నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా ఒకటే కొంచెం వీక్ గా అనిపించింది. బాస్ పార్టీని మరిపించే పాట కష్టమేనని అర్థమైపోయింది. కాకపోతే ఖైదీ నెంబర్ 150 లాగా సినిమా రిలీజయ్యాక సాంగ్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశాన్ని కొట్టి పారేయలేం. వాల్తేరు వీరయ్య నుంచి ఇంకొక్క డ్యూయెట్ మాత్రమే పెండింగ్ ఉంది. ట్రైలర్ కన్నా ముందు జనవరి మొదటి వారంలోనే ఇది వచ్చేస్తుంది. ఇవన్నీ ఎలా ఉన్నా చిరు రవితేజ కలిసి డాన్స్ చేయడం మాత్రం కనులపండగే
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…