ఇప్పుడేదో పైకి సంక్రాంతికి భారీ చిత్రాల పోటీ కనిపిస్తోంది దానికే మాత్రం తీసిపోని రీతిలో 2023 ఏప్రిల్ నెల అంతకు మించి అనే స్థాయిలో భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా ఏడు మోస్ట్ వాంటెడ్ సినిమాలు నువ్వా నేనా అనే రేంజ్ లో తలపడనున్నాయి. ముందుగా 7న వచ్చేది ‘రావణాసుర’. సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రవితేజ కొంచెం నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడని ఇప్పటికే టాక్ ఉంది. సుశాంత్ మెయిన్ విలనని వినికిడి. సరిగ్గా వారం తర్వాత 14న చిరంజీవి ‘భోళా శంకర్’ రంగంలోకి దిగుతుంది. వాల్తేరు వీరయ్య రిలీజ్ తర్వాత బ్యాలన్స్ షూట్ వేగంగా పూర్తి చేస్తారు
అదే రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ‘జైలర్’ రావడం లాంఛనమే. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆల్మోస్ట్ లాక్ అయినట్టే. ‘రుద్రుడు’ కూడా అదే డేట్ కి షెడ్యూల్ చేశారు. అయితే తన ప్రాణంగా అభిమానించే తలైవాతో ఢీ కొట్టేందుకు లారెన్స్ ఏ మేరకు ఇష్టపడతాడనేది వేచి చూడాలి. అఫీషియల్ గా అయితే చెప్పేశారు. 21న సుప్రీమ్ హీరో సాయి ధరమ్ ‘విరూపాక్ష’ని రంగంలోకి దించుతారు. టీజర్ వచ్చాక దీని మీద అంచనాలు పెరిగాయి. సల్మాన్ ఖాన్ వెంకటేష్ కాంబోలో రూపొందుతున్న ‘కిసీకా భాయ్ కిసీకా జాన్’ పలు వాయిదాల తర్వాత ఆ డేట్ నే తీసుకుంది. తెలుగు వెర్షన్ రిలీజ్ భారీగానే ఉంటుంది
చివరి వారంలో 28న ‘పొన్నియన్ సెల్వన్ 2’ వస్తుంది. మణితర్నం దర్శకత్వంలో రూపొందిన ఈ విజువల్ గ్రాండియర్ రెండో భాగంలోనే అసలు కథ ఉంటుందని యూనిట్ చెబుతోంది. తమిళంలో మినహాయించి బయట అంతగా ఆకట్టుకోలేకపోయిన పీఎస్ 2లో స్టార్ క్యాస్టింగ్ ఎంత ఉన్నా ఆర్ఆర్ఆర్ రేంజ్ లో జనాల్ని మెప్పించలేకపోయింది. మరి సీక్వెల్ అయినా ఏమైనా మేజిక్ చేస్తుందేమో చూడాలి. ఈ లెక్కన ఏప్రిల్ చాలా టైట్ గా మారిపోయింది. అందుకే నాగచైతన్య కస్టడీని మే 12కి షిఫ్ట్ చేసి నిర్మాతలు మంచి నిర్ణయం తీసుకున్నారు. పైన చెప్పిన వాటిలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.
This post was last modified on December 30, 2022 10:29 am
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…