తెలుగు టు హిందీ డబ్బింగ్ వెర్షన్లకు నార్త్ ఆడియన్స్ పూర్తి స్థాయిలో థియేటర్లకు రాని పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగు పడుతున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్ కు వచ్చిన గుర్తింపు సాహు ఫలితానికి, రాధే శ్యామ్ ఓపెనింగ్స్ కి చాలా ఉపయోగపడింది. పుష్ప 1 గురించి తెలిశాక మొదటిరోజు లేని ఉత్తరాది జనం సెకండ్ వీక్ నుంచి క్యూ కట్టారు. కృష్ణతత్వం మీద బాగా తీశారనే పేరు వచ్చాకే కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ కాగలిగింది. ఇలా ప్రత్యేక కారణాలు లేనిదే టాలీవుడ్ బొమ్మలను ఈజీగా తీసుకెళ్లలేం. అయితే వాల్తేరు వీరయ్య టీమ్ మాత్రం జనవరి 13నే అక్కడా రిలీజ్ కు సిద్ధపడటం ఖచ్చితంగా రిస్క్ ని సూచిస్తుంది.
దీనికి వెనుక పలు అంశాలున్నాయి. మొదటిది ఆ సీజన్ లో బాలీవుడ్ లో ఏ నోటెడ్ రిలీజ్ లేదు. కుత్తే ఉంది కానీ ఆదో డిఫరెంట్ జానర్. పోలీస్ డిపార్ట్ మెంట్ నేపథ్యంలో క్రైమ్ కాన్సెప్ట్ మీద తీశారు. పైగా అర్జున్ కపూర్ హీరో. మాస్ పబ్లిక్ అసలే రారు. ఇదే టైపులో మరొకటుంది కానీ అదీ బీసీ సెంటర్స్ కి ఫిట్ కానిదే. అందుకే వీరయ్యని సరిగా ప్రమోట్ చేసుకోగలిగితే ఫలితాలు బాగుంటాయి. రెండో రీజన్ ఈ మధ్య గాడ్ ఫాదర్ వల్ల చిరంజీవి రీ ఎంట్రీ మీద అక్కడి ప్రేక్షకులకు అవగాహన వచ్చింది. సల్మాన్ ఉన్నాడనో లేక మరొకటో ఏదైతేనేం ఈయనా సీనియర్ మోస్ట్ స్టార్ అనే సాఫ్ట్ కార్నర్ ఉంది.
పైగా రవితేజ ఎలాగూ ఉన్నాడు. తెలుగులో పాటలు ఛార్ట్ బస్టర్ అయ్యాయి. సరైన క్వాలిటీతో డబ్బింగ్ చేయిస్తే అక్కడా రీచ్ అవుతాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం హిందీ మ్యూజిక్ లవర్స్ కి సుపరిచితమే. అందుకే వీరసింహారెడ్డికి వద్దనుకున్న అనువాదం కేవలం వాల్తేరు వీరయ్యకు చేస్తున్నారు. అయితే పబ్లిసిటీ విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. మైత్రికి ఇక్కడ చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ని మేనేజ్ చేయడమే పెద్ద సవాల్ గా మారింది. అలాంటిది ఇంకో అదనపు బాధ్యత నెత్తి మీదేసుకున్నారు. ప్రమోషన్లకే తగినంత సమయం లేదు. మరి మెగాస్టార్ మేజిక్ ఈసారైనా పని చేస్తుందో లేదో.
This post was last modified on December 29, 2022 5:18 pm
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…