పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. టాలీవుడ్లో కొన్నేళ్ల నుంచి చురుగ్గా సినిమాలు నిర్మిస్తున్న సంస్థ. సినిమాల ఎంపికలో మంచి అభిరుచినే చూపిస్తున్నప్పటికీ.. ఆ సంస్థకు ఒక దశ వరకు భారీ విజయాలు దక్కలేదు. గూఢచారి, ఓ బేబీ లాంటి హిట్లు ఉన్నప్పటికీ.. తేడా కొట్టిన సినిమాల లిస్టు పెద్దదే. ఒక దశ వరకు చిన్న పెట్టుబడులు పెడుతూ.. వేరే సంస్థ భాగస్వామ్యంలో సినిమాలు నిర్మిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఈ మధ్య జోరు పెంచింది. కొంచెం పెద్ద స్థాయిలో సోలోగా సినిమాలు ప్రొడ్యూస్ చేస్తోంది. వాళ్లు చేస్తున్న సాహసాలకు మంచి ఫలితాలే దక్కుతున్నాయి.
ముఖ్యంగా 2022వ సంవత్సరం పీపుల్స్ మీడియా బేనర్‌కు మరపు రానిదే. పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్‌బస్టర్ అయిన ‘కార్తికేయ-2’తో ఆ సంస్థ పేరు మార్మోగింది. ఇప్పటిదాకా ఆ సంస్థలో వచ్చిన ఫెయిల్యూర్ సినిమాల నష్టాలన్నింటినీ ఈ ఒక్క చిత్రం కవర్ చేసేసిందంటే అతిశయోక్తి కాదు.
అంత పెద్ద బ్లాక్ బస్టర్ తర్వాత పీపుల్స్ మీడియా నుంచి తాజాగా ‘Dhamaka’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు విడుదల ముంగిట పెద్దగా హైప్ కనిపించలేదు. టాక్ కూడా కొంచెం అటు ఇటుగానే వచ్చింది. కానీ ఈ ప్రభావం ఏమీ సినిమా పెర్ఫామెన్స్ మీద ప్రభావం చూపలేదు. తొలి రోజు నుంచి వసూళ్ల మోత మోగిస్తూ సాగుతున్న ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. బయ్యర్లందరూ సేఫ్ జోన్‌కు దగ్గరగా ఉన్నారు. ఈ వీకెండ్లో చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవు కాబట్టి రెండో వారంలోనూ ‘ధమాకా’ జోరు కొనసాగించడం ఖాయం.
సినిమా మంచి లాభాలు అందుకుని బ్లాక్ బస్టర్ రేంజ్ అందుకున్నా ఆశ్చర్యం లేదు. ఐదు నెలల వ్యవధిలో రెండు బ్లాక్‌బస్టర్లు కొట్టడం అంటే ఏ సంస్థకైనా పెద్ద విషయమే. ఈ ఊపులో Pawan kalyanతో అనుకుంటున్న సినిమా కనుక ఓకే అయితే పీపుల్స్ మీడియా వారి పంట పండినట్లే.
This post was last modified on December 27, 2022 7:12 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…