Movie News

‘ఖుషి’ కబుర్లు: ఎస్.జె.సూర్య ముందు ఫీలైనా..

ఖుషి.. ఈ పేరు వింటే చాలు పవర్ స్టార్ Pawan kalyan అభిమానులు పులకించిపోతారు. పవన్ కెరీర్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది, బద్రి, తమ్ముడు లాంటి బ్లాక్‌బస్టర్లున్నాయి. ‘తొలి ప్రేమ’ లాంటి కల్ట్ మూవీ ఉంది. కానీ ‘ఖుషి’ వీటన్నింట్లోకి భిన్నం. అది ‘తొలి ప్రేమ’లా కల్ట్ స్టేటస్ తెచ్చుకోవడమే కాదు.. పైన చెప్పుకున్న సినిమాలను మించి బ్లాక్‌బస్టర్ అయింది.

ఇది తమిళంలో ‘ఖుషి’ పేరుతోనే సూపర్ హిట్టయిన సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కానీ Vijay హీరోగా నటించిన ఆ సినిమా చూసిన తమిళ జనాలు కూడా ఇగో పక్కన పెట్టి మాట్లాడితే తెలుగు వెర్షనే బాగుందని అంటారేమో. అంతగా దీనికి తెలుగులో మెరుగులు దిద్దారు. ముఖ్యంగా హీరో పాత్రను పవన్ పండించిన విధానం, అనేక రకాల అడిషన్స్‌తో దానికి మెరుగులు దిద్దిన విధానం అభినందనీయం. ఈ క్రెడిట్ అంతా కూడా పవన్ కళ్యాణ్‌కే దక్కుతుందని వేరే చెప్పాల్సిన పని లేదు.

తెలుగులో కొత్తగా పెట్టిన హీరో ఇంట్రో సాంగ్ (ఏ మేరాజహా).. ఫైట్లు.. తమిళంతో పోలిస్తే పూర్తి భిన్నంగా చిత్రీకరించిన పాటలు.. వీటన్నింటి క్రెడిట్ పవన్‌దే. ఈ విషయాన్ని దర్శకుడు SJ Surya కూడా ఏమాత్రం భేషజం లేకుండా అంగీకరిస్తాడు. తమిళంలో సూపర్ హిట్టయిన ‘ఖుషి’ సినిమా తెలుగులో బ్లాక్‌బస్టర్ అయిందంటే అది పూర్తిగా పవన్ క్రెడిట్టే అని ఓ ఇంటర్వ్యూలో సూర్య స్టేట్మెంట్ ఇవ్వడం విశేషం.

నిజానికి తెలుగులో హీరో పాత్రను మారుస్తున్నపుడు, ఇంట్రో సాంగ్ హిందీలో పెట్టాలని పవన్ నిర్ణయించుకున్నపుడు తాను కొంచెం ఫీలై ఇది కరెక్టేనా అని సందేహించిన మాట వాస్తవమని సూర్య తెలిపాడు. కానీ సినిమా చూశాక పవన్ నిర్ణయమే కరెక్ట్ అనిపించిందని.. అది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచిందని సూర్య తెలిపాడు. ఇక ఫైట్లన్నీ కూడా పవనే చాలా కొత్తగా డిజైన్ చేసుకున్నాడని.. గుడుంబా సత్తి ట్రాక్ క్రెడిట్ అంతా కూడా పవన్‌దే అని కూడా సూర్య చెప్పడం విశేషం. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. ‘ఖుషి’ సినిమా రీరిలీజ్ నేపథ్యంలో మరోసారి ఆ వీడియోను సోషల్ మీడియాలో తిప్పుతున్నారు పవన్ ఫ్యాన్స్.

This post was last modified on December 27, 2022 2:45 pm

Share

Recent Posts

సిరిసిల్ల కాదు.. ఉరిసిల్ల‌.. రెచ్చిపోయిన రేవంత్‌రెడ్డి

టార్గెట్ కేటీఆర్.. ల‌క్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. బీఆర్ఎస్ నాయ‌కుడు, మాజీ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న…

21 minutes ago

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

3 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

5 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

7 hours ago