ఇంకో అయిదే రోజుల్లో 2022 సెలవు తీసుకోనుంది. సినిమాలకు సంబంధించి అందులోనూ ముఖ్యంగా దక్షిణాది పరిశ్రమకు ఎన్నో గొప్ప విజయాలు జ్ఞాపకాలు మిగిల్చిన ఈ ఏడాది చివరి శుక్రవారం కొత్త సినిమాల సందడి కౌంట్ సంఖ్యాపరంగా ఎక్కువగానే ఉన్నప్పటికీ కంటెంట్ పరంగా మాత్రం ఏదీ ఆడియన్స్ దృష్టిని ఇట్టే ఆకట్టుకునేలా లేదు. అన్నీ చిన్న బడ్జెట్ చిత్రాలే కావడం, స్టార్ క్యాస్టింగ్ లేకపోవడం, ప్రమోషన్ల విషయంలో సరైన ప్లానింగ్ చేసుకోకపోవడం లాంటి కారణాల వల్ల ఓపెనింగ్స్ ఆశించడం అత్యాశే. ఏదో బ్రహ్మాండంగా ఉందనే టాక్ వస్తే తప్ప రెండో రోజు నుంచి పికప్ ఆశించలేం.
ఒకరకంగా చెప్పాలంటే లాస్ట్ ఫ్రైడే క్లియరెన్స్ సేల్ జరుగుతోంది. అందులో బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ మొదటిది. ఏదో టూర్లు గట్రా తిరుగుతూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రెండోది ఆది సాయికుమార్ ‘టాప్ గేర్’. హిట్ కొట్టడం అందని ద్రాక్షగా మారిపోయిన ఈ కుర్ర హీరోకి ఇదైనా సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి. ట్రైలర్ కొంత ఆసక్తికరంగానే ఉంది. తారకరత్న ప్రధాన పాత్ర పోషించిన ‘S5’ థ్రిల్లర్ జానర్ లో రూపొందింది. ‘రాజయోగం’ అనే మరో చిన్న మూవీ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ప్రేమదేశం, నువ్వే నా ప్రాణం, ఉత్తమ విలన్ కేరాఫ్ మహదేవపురం, కోరమీనులు సైతం ఇయర్ ఎండింగ్ క్యూలో నిలబడ్డాయి
అటు బాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ రిలీజులు ఏవీ లేవు. సర్కస్ ఆడేస్తుందన్న నమ్మకంతో ఇతర హీరోలు వారానికే రావడం ఎందుకులే అనుకున్నారు కానీ తీరా చూస్తే సీన్ రివర్స్ అయ్యింది. కన్నడలో మొన్న 23న వచ్చిన శివరాజ్ కుమార్ వేదకు అక్కడ హిట్ టాక్ వచ్చినా దాని డబ్బింగ్ వెర్షన్ ఎందుకనో ఆలస్యం చేస్తూ వచ్చారు. ఇక్కడ చెప్పిన వాటికి హిట్ టాక్ వస్తేనే ఏదో విధంగా గట్టెక్కుతాయి. వీటికన్నా పవన్ కళ్యాణ్ ఖుషికి ఆన్ లైన్ బుకింగ్స్ జోరుగా జరుగుతున్నాయి. ఇరవై ఏళ్ళ తర్వాత వస్తున్న క్లాసిక్ బ్లాక్ బస్టర్ కావడంతో టికెట్లు వేగంగా అమ్ముడుపోతున్నాయి. ఈ లెక్కన ధమాకా జోరు కొనసాగేలా ఉంది.
This post was last modified on December 27, 2022 2:29 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…