Movie News

ధమాకా మాసు వీరయ్యకు ప్లస్సు

ఊహించని స్థాయిలో ధమాకా బాక్సాఫీస్ ని ఊపేయడంతో మాస్ మహారాజా Raviteja ఫ్యాన్స్ ఆనందం మాటల్లో చెప్పేది కాదు. ప్రస్తుతానికి వీక్ డేస్ డ్రాప్ కనిపిస్తున్నప్పటికీ మొదటి మూడు రోజుల వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చేశాయి. బ్రేక్ ఈవెన్ దాటేయడంతో ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ చేసిన గాయాలు పూర్తిగా మాసిపోయాయి. కనీసం ఇంకో వారం స్ట్రాంగ్ రన్ ఖాయంగా కనిపిస్తోంది. ఫైనల్ ఫిగర్ ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేం కానీ మాస్ రాజా టాప్ త్రీలో ఉండటం కన్ఫర్మ్ అయ్యింది. మాస్ సెంటర్స్ లో మంచి రెవిన్యూ కొనసాగడం ఖాయమని ట్రేడ్ నమ్మకంగా చెబుతోంది

ఇప్పుడీ ప్రభావం వాల్తేరు వీరయ్యకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ Dhamaka ఏ మాత్రం అటుఇటు అయినా చిరంజీవి సినిమాలో చేసింది స్పెషల్ రోల్ కాబట్టి రవి ఫ్యాన్స్ ఈ రేంజ్ లో జోష్ చూపించేవారు కాదు. కానీ ఇప్పుడది హిట్టయ్యింది కనక రెట్టింపు ఉత్సాహంతో ఓపెనింగ్స్ కి తోడ్పడతారు. పైగా రవితేజ ఇవాళ్టి నుంచి మెగాస్టార్ తో కలిసి ప్రమోషన్లలో పాలుపంచుకోబోతున్నాడు. అందులో భాగంగానే సాయంత్రం అయిదు గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరు హీరోలు వస్తారనే సమాచారం ఉంది. విడివిడిగా టీజర్లైతే వచ్చాయి కానీ కాంబో సాంగ్ ప్లస్ ఇద్దరూ కలిసి డాన్స్ చేసిన అసలైన పాట రావాల్సి ఉంది.

సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఉండటంతో పాటు వీరసింహారెడ్డి నిర్మాతలూ మైత్రి వాళ్లే కావడం వల్ల పబ్లిసిటీ విషయంలో మెగా కాంపౌండ్ సైతం ఓ చేయి వేయక తప్పేలా లేదు. మొన్న వ్యక్తిగతంగా పెట్టుకున్న ఫ్యాన్స్ మీటింగ్ కారణం ఇదే. ఇప్పటిదాకా వచ్చిన మూడు పాటలకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఇకపై వచ్చే ఏ ప్రమోషన్ కంటెంట్ అయినా సరే సోషల్ మీడియాలో బలంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. అఖండ సక్సెస్, అన్ స్టాపబుల్ షోకు వచ్చిన రెస్పాన్స్ తో బాలయ్య ఫుల్ ఎనర్జీతో ఉండగా ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితంతో Chiru ఎలాగైనా హిట్టు కొట్టాలనే కసిమీద ఉన్నారు.

This post was last modified on December 27, 2022 7:18 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

6 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

1 hour ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

3 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

4 hours ago