బాలయ్యతో పవన్ – షూటింగ్ కే ఇంత స్పందనా

అసలు ఎవరూ ఊహించని కాంబినేషన్ అన్ స్టాపబుల్ షోకు సెట్ అయిన సంగతి తెలిసిందే. ప్రభాస్ రావడమే అద్భుతంగా ఫీలవుతున్న మూవీ లవర్స్ ఉద్వేగాన్ని మరోస్థాయికి తీసుకెళ్తూ ఇవాళ Pawan kalyan ఎపిసోడ్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరణకు సిద్ధం చేశారు. బయట అభిమాన సందోహం ఏదో ప్యాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ రేంజ్ లో రావడం మీడియాని సైతం ఆశ్చర్యపరిచింది. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏకంగా లైవ్ కవరేజ్ లు ఇవ్వడం ఇంకో పెద్ద ట్విస్ట్. అతిథి మర్యాదలను పాటిస్తూ బాలకృష్ణ, అల్లు అరవింద్ బయట ఎదురు చూసి మరీ పవన్ సాదరంగా తీసుకెళ్లే దృశ్యాలు కెమెరాలో పడ్డాయి.

ఆహాకు ఇప్పడీ టాక్ షో ప్రాణవాయువుగా మారిపోయింది. సెకండ్ సీజన్ ప్రారంభంలో ఆశించిన గెస్టులు రావడం లేదనే అసంతృప్తిని పూర్తిగా తొలగించేస్తూ ముందు Prabhas ఆ తర్వాత పవన్ ఇలా సెట్ చేయడం వెనుక అరవింద్ అపారమైన అనుభవం తెలివితేటలు కనిపిస్తున్నాయి. ప్రాంగణం బయట పెద్ద బ్యానర్లు, ఎక్కడెక్కడి నుంచో పవన్ బాలయ్య ఫ్యాన్స్ అక్కడికి చేరుకోవడం ఉదయం నుంచే సందడి మాములుగా లేదు. లోపలికి పాసులు ఉన్న వాళ్ళకు మాత్రమే పరిమిత ఎంట్రీ ఉండటంతో ఈ భాగాన్ని ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ వాటిని దక్కించుకున్న కొద్దిమందికే దక్కనుంది

ఈ ఇద్దరి మధ్య సంభాషణ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. సాయి ధరమ్ తేజ్ తో మధ్యలో ఓ వీడియో కాల్ ఉంటుందట. త్రివిక్రమ్, క్రిష్ లు హాజరవుతారని తెలిసింది. చాలా జోవియల్ గా షోని నడిపించే బాలయ్య పవన్ తో ఏం మాట్లాడిస్తాడన్నది సస్పెన్స్. సినిమాలు, రాజకీయాలు, జనసేన, రాబోయే రిలీజులు. Chiranjeeviతో ఇద్దరికున్న అనుబంధం ఇలా ఎన్నో అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్ సంక్రాంతికి లేదా ఆ తర్వాత ఉండొచ్చు. బిగ్గెస్ట్ టాక్ షోగా రూపాంతరం చెందుతున్న అన్ స్టాపబుల్ షోకి మూడో సీజన్ కి సరిపడా ఇంకా చెప్పాలంటే అంతకు మించి హైప్ వచ్చేసింది.