Pawan Kalyan క్రేజీ మూవీ ‘ఖుషి’ ఇప్పటికీ ఫ్యాన్స్ బెస్ట్ మూవీస్ లిస్టులో టాప్ ప్లేన్ ఉంటుంది. అప్పట్లో ఈ కాలేజీ లవ్ స్టోరీతో కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు పవన్. అందుకే రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న ఈ టైంలో నిర్మాత ఏ ఎం రత్నం మళ్ళీ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ కొత్త ట్రైలర్ , రిలీజ్ పోస్టర్స్ తో సోషల్ మీడియాలో హంగామా మొదలెట్టేశారు. తాజాగా నిర్మాత ఖుషి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు బయట పెట్టారు.
ఖుషి లండన్ లో రిలీజైన మొదటి తెలుగు సినిమా అని తాజాగా నిర్మాత రత్నం వెల్లడించారు. అలాగే తమిళ్ లో అదే రోజు రిలీజ్ చేశామని తెలిపాడు. “అప్పట్లో తెలుగు సినిమాలను తమిళనాడులో విడుదల చేయడంలో కొంత జాప్యం జరుగుతుండగా.. ఖుషి మాత్రం ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఒకే రోజు విడుదలైంది. మణిరత్నంతో సహా తమిళనాడులోని పలువురు ప్రముఖులు ఈ చిత్రాన్ని థియేటర్లలో వీక్షించారు. లండన్‌లో విడుదలైన తొలి తెలుగు సినిమా కూడా ‘ఖుషి’నే. నా కుమారుడు అదే సమయంలో లండన్‌లో చదువుతున్నాడు. దాంతో ఖుషిని అక్కడ విడుదల చేయడానికి అతడి స్నేహితుడి సహాయం తీసుకున్నాం. ” అంటూ ఖుషి రిలీజ్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు నిర్మాత.
అలాగే ఖుషి క్లైమాక్స్ గురించి కూడా కొన్ని సంగతులు పెంచుకున్నారు ” తమిళ వెర్షన్ క్లైమాక్స్‌లో జంట కవలలకు జన్మనిచ్చినట్లు చూపించాలి అనుకున్నాము. అయితే అప్పటికే మేము మరో వెర్షన్ కి చిత్రీకరించాము. కొన్ని కారణాల వల్ల దానిని మార్చలేకపోయాం. తెలుగు వెర్షన్ కోసం మాత్రం దానిని అమలు చేసాము. తెలుగు క్లైమాక్స్ పట్ల నేను చాలా సంతోషించాను. 10 ఏళ్లలోపులో చాలా మంది పిల్లలకు జన్మనివ్వడం చాలా సరదాగా అనిపించింది. ” అంటూ ఖుషి క్లైమాక్స్ వెనుక జరిగిన విషయాలను తెలియజేస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళారు ఏ ఎం రత్నం.
This post was last modified on December 26, 2022 8:29 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…