డార్లింగ్ ప్రభాస్ ఊపిరి సలపనంత బిజీలో సినిమాలు చేస్తున్నా సరే కొత్త కాంబినేషన్లు సెట్ చేసుకోవడంలో మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు. అయిదారేళ్ళ పాటు ఏ మాత్రం తీరిక లేకుండా వరసగా షూటింగ్స్ లోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పుడున్నవి ఎప్పుడు పూర్తవుతాయో ఎప్పుడు రిలీజవుతాయో పూర్తి క్లారిటీ లేదు కానీ చాలా తెలివిగా డైరెక్టర్ కాంబోస్ ని లాక్ చేసి చురుకుగా ఉంటున్నాడు. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ప్రభాస్ సుకుమార్ కలయికలో ఒక ప్యాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధమవుతోందట. పుష్ప 2 రిలీజయ్యాక దీనికి సంబందించిన పనులను సుక్కు మొదలుపెట్టబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్.
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి బ్లాక్ బస్టర్స్ తో మంచి ఊపుమీదున్న నిర్మాత అభిషేక్ అగర్వాల్ దీన్ని తెరకెక్కిస్తారట. ఆ మధ్య ఈయనతో పాటు సుకుమార్, బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి ఒక ఫోటోని షేర్ చేసుకున్నారు. ఆ పిక్ వెనుక అంతరార్థం ఇదేనని వినికిడి. ప్రభాస్ ప్రస్తుతం సలార్ ని పూర్తి చేసే పనిలో ఉంటూనే మధ్యలో వచ్చిన ఖాళీలో మారుతీకి డేట్స్ కి దాని చిత్రీకరణ వేగంగా అయ్యేలా చూసుకుంటున్నాడు. ప్రాజెక్ట్ కె కోసం నాగ అశ్విన్ చిన్న బ్రేక్ ఇవ్వడంతో ఆ సమయం ఇలా ఉపయోగపడుతోంది. ఆది పురుష్ పరంగా ప్రభాస్ నేరుగా చెయ్యాల్సింది ఏమి లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఒకటే బ్యాలన్స్.
ఇక సందీప్ రెడ్డి వంగాతో అనౌన్స్ చేసిన స్పిరిట్ అతను రన్బీర్ కపూర్ తో తీస్తున్న అనిమల్ ఎప్పుడు పూర్తవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సుకుమార్ ఇంకో ఏడాదిన్నరలో పుష్ప 2 నుంచి ఫ్రీ అవుతారు. రామ్ చరణ్ తో ఓ సినిమా అన్నారు కానీ దానికి సంబంధించిన స్పష్టమైన వివరాలు ఇంకా బయటికి రాలేదు. సో మొత్తానికి సుక్కు డార్లింగ్ కలవడం 2024లో సాధ్యమవుతుంది. ఇన్నేసి సినిమాలు చేస్తున్నా రిలీజ్ డేట్ల విషయంలో చిక్కులు ఎదురుకుంటూనే ఉన్న ప్రభాస్ తన ఫ్యాన్స్ కోసం వచ్చే ఏడాది ఏకంగా రెండు విడుదలలు కానుకగా ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది ఏదైనా అనూహ్యంగా మారితే తప్ప.
This post was last modified on December 26, 2022 1:29 pm
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…
పెట్టుబడులను రాబట్టేందుకు ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లిన తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి రెండో రోజే ఫలితం రాబట్టారు.…
ఏపీలో అధికార కూటమిలో కీలక పార్టీగా ఉన్న జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలోని రాజకీయా…
2023 సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని మరోసారి బాలకృష్ణతో చేతులు కలపబోతున్నారు. త్వరలో…
గత ఏడాది రాజకీయాల కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రేక్ తీసుకున్న టైంలో ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.…
టెక్నాలజీ రంగంలో తెలుగు ప్రజలు ఇప్పుడు విశ్వవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. ఐటీలో మేటి సంస్థలు మైక్రోసాఫ్ట్, గూగుల్ లకు భారతీయులు……