సంక్రాంతి సినిమాల మీద హైప్ ఏ రేంజ్ లో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీటికి సంబంధించిన ఏ విషయమైనా సరే ఫ్యాన్స్ లో విపరీతమైన ఎగ్జైట్ మెంట్ కు కారణమవుతోంది. చిరంజీవి బాలకృష్ణలు అయిదేళ్ల తర్వాత తలపడుతుండటంతో ఈసారి ఫీవర్ ఇంకాస్త ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో జరిగిన మెగా ఫ్యాన్స్ సమావేశానికి వాల్తేర్ వీరయ్య నిర్మాతతో పాటు దర్శకుడు బాబీ, తెలుగు రాష్ట్రాల అభిమాన సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. పూర్తిగా ప్రైవేట్ వ్యవహారంగా నడిచిన ఈ మీటింగ్ లో చాలా అంశాలే చర్చకొచ్చాయి. ముఖ్యంగా థియేటర్లు, బెనిఫిట్ షోల గురించి డిస్కస్ చేసుకున్నారు.
దర్శకుడు బాబీ తన ప్రసంగంలో కీలకమైన చిరు ఇంట్రో గురించి లీక్ ఇచ్చేశారు. పది రోజుల పాటు భారీ వర్షంలో బోటు మీద చిరంజీవి పరిచయ సన్నివేశాన్ని చిత్రీకరించామని, అందరూ చలికి వణుకుతుండగా ఆయన మాత్రం అలాగే పాల్గొని డూప్ అవసరం లేకుండా నటించారని ఫుల్ ఎలివేషన్లు ఇచ్చేశాడు. ఇలాంటి సీన్లు క్రమం తప్పకుండా వస్తూనే ఉంటాయని, ఒక చిరు అభిమాని ఎలాగైతే మెగాస్టార్ ని చూడాలి అనుకుంటారో దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా చూపిస్తానని హామీ ఇచ్చేశాడు. సరే రిలీజ్ కు ముందు ఇలాంటి ఉత్సాహం ఇచ్చే మాటలు చెప్పడం సహజమే కాబట్టి తరచి చూడాల్సిన అవసరం లేదు.
బాబీకి వాల్తేరు వీరయ్య సక్సెస్ చాలా కీలకం. ఎందుకంటే జై లవకుశ, వెంకీ మామలు కమర్షియల్ గా ఏ స్కేల్ లో వర్కౌట్ అయినా ఆ హీరోల ఎనర్జీని పూర్తి స్థాయిలో వాడుకునేలా సరైన స్క్రిప్ట్ లు రాసుకోలేదనే కామెంట్స్ లేకపోలేదు. అందుకే ఆచార్య డిజాస్టర్, గాడ్ ఫాదర్ యావరేజ్ ఫలితంతో డీలా పడిన అభిమానులకు కనక అంచనాలకు తగ్గట్టు సినిమా ఇస్తే ఆపై స్టార్ హీరోల నుంచి ఆఫర్లు క్యూ కడతాయి. పైగా రవితేజకో పవర్ ఫుల్ పాత్ర ఇవ్వడం, దేవిశ్రీప్రసాద్ కు పాటలకు మంచి రీచ్ రావడం ఇవన్నీ సానుకూల అంశాలే. మరి బాబీ అన్నట్టు నిజంగా వీరయ్య అంత సత్తా చూపిస్తాడా వేచి చూడాలి
This post was last modified on December 26, 2022 11:40 am
భారత్, పాక్ ల మధ్య యుద్ధ మేఘాలు అలుముకున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసిన…
రీ రిలీజ్ ట్రెండ్ లో ఒకప్పటి వింటేజ్ సినిమాలను థియేటర్ లో అనుభూతి చెందాలనే ప్రేక్షకులు భారీగా ఉన్నారు. నిన్న…
భారత్, పాకిస్తాన్ సరిహద్దుల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. అనధికారికంగా యుద్ధం జరుగుతున్న క్రమంలో రేపో,మాపో…
నేచురల్ స్టార్ నాని ‘హిట్-3’తో తన కెరీర్లోనే అతి పెద్ద హిట్ కొట్టాడు. గత వారం విడుదలైన ఈ చిత్రం..…
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…