ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్లో బాగానే ఆధిపత్యం చూపించాయి. KGF-2, Brahmastra, Kantara, Love Today లాంటి చిత్రాలు మన దగ్గర బాగా ఆడాయి. ముఖ్యంగా కేజీఎఫ్-2, కాంతార అయితే టాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఐతే ముగింపులో మాత్రం డబ్బింగ్ బొమ్మలకు ఘోర పరాభవం తప్పలేదు.
క్రిస్మస్ కానుకగా తెలుగులో రెండు పేరున్న చిత్రాలు షెడ్యూల్ అయినప్పటికీ.. తమిళ అనువాదాలైన ‘లాఠీ’, ‘కనెక్ట్’ చిత్రాలను తెలుగులో కొంచెం పెద్ద స్థాయిలోనే రిలీజ్ చేశారు. ఇవి రెండూ ఒక రోజు ముందే రావడంతో కోరుకున్న దాని కంటే ఎక్కువ థియేటర్లే కేటాయించారు.
కానీ ఆ ఒక్క రోజును కూడా ‘Laththi’, ‘Connect’ ఉపయోగించుకోలేకపోయాయి. ఈ సినిమాలకు మార్నింగ్ షోల నుంచే తిరస్కారం మొదలైంది. ఆ తర్వాత అవి ఏ దశలోనూ పైకి లేవలేకపోయాయి.
శుక్రవారం రిలీజైన ‘Dhamaka’, ‘18 Pages’ చిత్రాలు రెండూ యావరేజ్ టాకే తెచ్చుకున్నప్పటికీ వాటికి మంచి వసూళ్లే వచ్చాయి. ముఖ్యంగా ‘ధమాకా’ అంచనాలను మించి వసూళ్లతో అదరగొడుతోంది. వీకెండ్ అంతా సందడి ఆ చిత్రానిదే. ‘18 పేజెస్’కు సిటీల్లో, ముఖ్యంగా మల్టీప్లెక్సుల్లో ఆదరణ బాగుంది.
లాఠీ, కనెక్ట్ చిత్రాలకు మినిమం కలెక్షన్లు లేవు. ఆ చిత్రాలకు కేటాయించిన స్క్రీన్లను ముందే రెండో రోజు నుంచి చాలా వరకు తీసేసే ఆలోచన ఉంది. కానీ టాక్ బాగుంటే ఓ మోస్తరుగా అయినా స్క్రీన్లు కొనసాగించేవారు.
కానీ తొలి రోజే చతికిలపడడంతో చాలా స్క్రీన్లను లేపేశారు. గత వారం వచ్చిన ‘అవతార్-2’ మల్టీప్లెక్సుల్లో కొత్త సినిమాలకు దీటుగా స్క్రీన్లు, షోలతో నడుస్తుండగా.. ధమాకా, 18 పేజెస్ చిత్రాలకు స్పందన బాగుండడంతో తమిళ అనువాదాల పని క్లోజ్ అయిపోయింది. వీకెండ్లోనూ ప్రభావం చూపలేక అవి డిజాస్టర్లుగా మిగిలాయి.
This post was last modified on December 25, 2022 6:20 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…