ప్రతి వ్యక్తి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటున్న ఈ రోజుల్లో సినిమాల చిత్రీకరణను ఔట్ డోర్లలో చేయడం చాలా చాలా కష్టమైపోతోంది. షూటింగ్ తాలూకు ఫొటోలు, వీడియోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో పెట్టేసి వైరల్ చేసేస్తున్నారు. దీంతో చాలా వరకు సినిమాల చిత్రీకరణలు సెట్లలో, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య చేస్తున్నారు. యూనిట్లో ముఖ్య వ్యక్తులు తప్ప ఎవ్వరూ సెల్ ఫోన్లు తేకుండా నిషేధం విధిస్తున్నారు. ఇంత చేస్తున్నా ఎలాగోలా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అవుతూనే ఉంటాయి.
ఇప్పుడు రామ్ చరణ్ కొత్త చిత్రం విషయంలోనూ ఈ లీకుల బెడద తప్పట్లేదు. ఇంతకుముందే ఈ సినిమాకు సంబంధించి అంతగా స్పష్టత లేని ఫొటోలు కొన్ని లీకయ్యాయి. తాజాగా #RC15 కొన్ని ఫొటోలతో పాటు వీడియోలు కూడా లీక్ కావడం చిత్ర బృందాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీనిపై చిత్ర బృందం కొంచెం తీవ్రంగానే స్పందించినట్లు కనిపిస్తోంది.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎక్కువగా రాజమండ్రి ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇంతకుముందే అక్కడ కొన్ని రోజులు చిత్రీకరణ జరిపారు. తాజాగా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టగా.. అందుకోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్ తాలూకు వీడియోతో పాటు చరణ్ కొత్త లుక్ తాలూకు ఫొటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. మెగా అభిమానులే కొందరు అత్యుత్సాహంతో ఫొటోలు, వీడియోలు లీక్ చేసి వైరల్ చేస్తున్నారు. దీంతో చిత్ర బృందం వెంటనే స్పందించింది. ఈ ఫొటోలు, వీడియోలు ఎవరైనా షేర్ చేస్తే ట్విట్టర్ అకౌంట్లు లేచిపోతాయని, కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
చరణ్ పీఆర్ వర్గాలు కూడా ఈ ఫొటోలు, వీడియోలను ఎవ్వరూ షేర్ చేయొద్దంటూ హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అభిమానులకు విన్నపాలు కూడా చేశారు. #RC15 చిత్రీకరణ 60 శాతానికి పైగానే పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
This post was last modified on December 23, 2022 10:40 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…