Movie News

క్రిస్మస్ కింగ్ ఎవరో?

ఈ నెల ఆరంభంలో ‘హిట్-2’ సినిమాతో టాలీవుడ్ బాక్సాఫీస్ కాస్త ఊపందుకున్నట్లే కనిపించింది. కానీ ఆ సినిమా తర్వాత థియేటర్లలో కళ తెచ్చే తెలుగు సినిమాలేవీ కనిపించలేదు. రెండో వారంలో వచ్చిన సినిమాలన్నీ దారుణంగా బోల్తా కొట్టాయి. గత వారం వచ్చిన హాలీవుడ్ మూవీ ‘అవతార్-2’ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబడుతూ సాగుతోంది. కాగా క్రిస్మస్ వీకెండ్‌ను ఉపయోగించుకోవడానికి రెండు పేరున్న తెలుగు చిత్రాలతో పాటు రెండు అనువాదాలు కూడా బరిలోకి దిగుతున్నాయి.

ఇందులో ఎక్కువ అంచనాలున్నది రవితేజ సినిమా ‘ధమాకా’ మీదే. మాస్ రాజా ఈ ఏడాది ఇప్పటికే రెండు డిజాస్టర్లు ఎదుర్కొన్నప్పటికీ.. ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురూ ప్రేమ కోసమే’ లాంటి హిట్లు కొట్టిన డైరెక్టర్-రైటర్ ద్వయం త్రినాథరావు-ప్రసన్నకుమార్ చేసిన సినిమా కావడం.. ట్రైలర్ కూడా ఎంటర్టైనింగ్‌గా అనిపించడంతో సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ‘పెళ్ళి సంద-డి’తో ఆకట్టుకున్న శ్రీలీల నటించిన రెండో చిత్రం ఇదే. శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రానికి పోటీగా నిఖిల్ మూవీ ‘18 పేజెస్’ కూడా దిగుతోంది.

‘కార్తికేయ-2’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత దానికి పూర్తి భిన్నంగా లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు నిఖిల్. ‘కార్తికేయ-2’ హీరోయిన్ అనుపమ పరమేశ్వరనే ఇందులోనూ కథానాయిక. సుకుమార్ స్క్రిప్టునందించడం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. దీని ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఈ రెండు చిత్రాల కంటే ముందు గురువారం థియేటర్లలోకి దిగుతున్నాయి తమిళ అనువాదాలైన లాఠి, కనెక్ట్. ఇందులో విశాల్ నటించిన ‘లాఠి’ రొటీన్ మాస్ మూవీలాగే కనిపిస్తోంది. దానికి పెద్దగా బజ్ లేదు. నయనతార హార్రర్ థ్రిల్లర్ ‘కనెక్ట్’ మాత్రం ఆ జానర్ ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ నాలుగు చిత్రాల్లో దేనికి మంచి టాక్ వస్తుంది..ఏది క్రిస్మస్ విజేతగా నిలుస్తుంది అన్నది చూడాలి.

This post was last modified on December 22, 2022 8:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫోటో : గాయపడ్డ పవన్ కుమారుడు ఇప్పుడిలా ఉన్నాడు!

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…

16 minutes ago

కాకాణికి షాకిచ్చిన హైకోర్టు.. అరెస్టు తప్పదా?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…

38 minutes ago

కన్నప్పకు కరెక్ట్ డేట్ దొరికింది

ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…

55 minutes ago

తారక్ & రజని రెండుసార్లు తలపడతారా

ఈ ఏడాది అతి పెద్ద బాక్సాఫీస్ క్లాష్ గా చెప్పుబడుతున్న వార్ 2, కూలి ఒకే రోజు ఆగస్ట్ 14…

1 hour ago

రెండు రాష్ట్రాల‌కూ ఊర‌ట‌.. విభ‌జ‌న చ‌ట్టంపై కేంద్రం క‌స‌రత్తు!

2014లో ఉమ్మ‌డి ఏపీ విడిపోయి.. రెండు రాష్ట్రాలుగా విడిపోయిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆ త‌ర్వాత‌.. కేంద్రంలో ప్ర‌భుత్వం మార‌డంతో..…

2 hours ago

ఫ్యాన్స్ మనోభావాలతో అప్డేట్స్ ఆట

స్టార్ హీరోలకు కోట్లలో అభిమానులు ఉంటారు. నిర్మాణంలో ఉన్న క్రేజీ సినిమాలకు సంబంధించిన అప్డేట్ అంటే చాలు వాళ్లకు  ప్రాణం…

2 hours ago