కొన్ని ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు ఆసక్తికరంగా ఉంటాయి. తృటిలో మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్లు, కోరి చేసుకున్న సూపర్ ఫ్లాపులు, కథలు మారి అద్భుతాలు జరిగిన సందర్భాలు ఎన్నో. అలాంటి వాటిలో ఇదొకటి. 2001లో విడుదలైన నరసింహనాయుడు బాలకృష్ణ అభిమానులకు ఎప్పటికి మర్చిపోలేని ఇండస్ట్రీ హిట్. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాలో పాటలు ఫైట్లు అన్నీ దేనికవే పోటీ పడుతూ గొప్ప విజయాన్ని అందించాయి. దీని వెనుక ఆసక్తికరమైన నేపథ్యం ఉంది. సమరసింహారెడ్డి తర్వాత బాలయ్య బి గోపాల్ లు మరో సినిమా చేయాలని నిర్మాత మేడికొండ వెంకటరమణకు కమిటయ్యారు.
రచయిత పోసాని కృష్ణమురళి చెప్పిన కథ నచ్చింది. పలు దఫాల చర్చల తర్వాత దాన్ని తీయాలని నిర్ణయించుకున్నారు. తమ కాంబోలోనే వచ్చిన రౌడీ ఇన్స్ పెక్టర్ తరహాలో ఇదీ సెన్సేషన్ అవుతుందన్న నమ్మకం కలిగింది. 2000 ఫిబ్రవరి 10న అక్కినేని నాగేశ్వరరావు గారి క్లాప్ తో బాలకృష్ణ ఖాఖీ డ్రెస్సులో ఉండగా తీసిన షాట్ తో ప్రారంభోత్సవం చేశారు. సౌందర్య సిమ్రాన్ హీరోయిన్లుగా ఎంపికయ్యారు. అంతా బాగానే ఉందనుకుంటున్న టైంలో ఇదెందుకో తన ఇమేజ్ కి వర్కౌట్ కాదనే అనుమానం బాలయ్యతో పాటు బి గోపాల్ కూ వచ్చేసింది. అక్కడితో ఆపేసి వేరే సబ్జెక్టు కోసం వెతుకుంటుండగా చిన్నికృష్ణ వచ్చాడు.
కుటుంబానికొకడు బయటికి వచ్చి ఒక సైన్యంలా మారి శత్రువుల నుంచి ఊరిని కాపాడే బలిదేవుడి లాంటి క్యారెక్టర్ తో వినిపించిన లైన్ బ్రహ్మాండంగా నచ్చేసింది. వెంటనే పరుచూరి బ్రదర్స్ కు కబురు పెట్టడం వాళ్ళు పవర్ ఫుల్ సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేయడం జరిగిపోయాయి. కట్ చేస్తే జరిగిన చరిత్ర తెలిసిందే. పోసాని ఇచ్చిన కథలోనూ హీరో పేరు నరసింహనాయుడే. దాన్ని మాత్రం మార్చకుండా టైటిల్ కు వాడుకున్నారు. బాలకృష్ణ డ్రాప్ అయిన దాన్ని పోసాని శ్రీహరి దగ్గరకు తీసుకెళ్తే అదే అయోధ్య రామయ్యగా రూపాంతరం చెందింది. ఇది జరగకపోయి ఉంటే ఒక క్లాసిక్ మాస్ బొమ్మ మిస్సయేదిగా.
This post was last modified on December 20, 2022 3:27 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…