ఈ ఏడాది సెన్సేషనల్ హిట్టయిన ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా సిద్ధు జొన్నలగడ్డ అండ్ టీం చేస్తున్న ‘టిల్లు స్క్వేర్’ కొంత కాలంగా నెగెటివ్ విషయాలతోనే వార్తల్లో నిలుస్తోంది. ముందుగా దర్శకుడి మార్పు చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత హీరోయిన్ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి.
చివరికి అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రానికి కథానాయికగా ఎంపికై కొన్ని రోజులు షూట్‌లోనూ పాల్గొంది. కానీ ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఆమె తప్పుకున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. సిద్ధుతో అనుపమకు గొడవ జరిగిందని కొందరు.. లిప్ లాక్స్ సీన్లు నచ్చక ఆమె బయటికి వెళ్లిపోయిందని మరికొందరు మాట్లాడుకున్నారు. కానీ ఈ సినిమా నుంచి అనుపమ తప్పుకోవడం మాత్రం వాస్తవమే అని తేలింది. ఆమె స్థానంలోకి మరో మలయాళ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ రానున్నట్లు వార్తలొచ్చాయి. కానీ చివరికి ఈ కథలో ఇప్పుడు ఇంకో ట్విస్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.
‘టిల్లు స్క్వేర్’లో మడోన్నా కూడా ఖరారు కాలేదట. ఆమెకు లుక్ టెస్ట్ చేశాక సిద్ధు పక్కన, కథానాయిక పాత్రకు సెట్ కాదని తేల్చేశారట. చివరికి అనుపమ అయితేనే ఈ పాత్రకు న్యాయం చేయగలదని భావించి ఆమెను మళ్లీ సంప్రదించిందట చిత్ర బృందం. ఇంతకుముందు సమస్య ఎక్కడ వచ్చిందన్నది కచ్చితంగా తెలియదు కానీ.. ఆ సమస్యను పరిష్కరించుకుని తిరిగి ఆమెను ఈ సినిమాలో నటింపజేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇలా ఇగోలు పక్కన పెట్టి చర్చించుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అయిపోతుంది. కాబట్టి ఈ ప్రాజెక్టులోకి అనుపమ తిరిగి రావడం పక్కా అని అంటున్నారు. అంగీకారం కుదిరితే వచ్చే వారం నుంచి మళ్లీ అనుపమ ‘టిల్లు స్క్వేర్’ షూట్‌లో పాల్గొనే అవకాశముంది. నటిగానే కాక వ్యక్తిత్వం విషయంలోనూ అందరితో మంచి మార్కులు వేసుకున్న అనుపమను వదులుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు?
This post was last modified on December 20, 2022 12:52 pm
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీర రాజమౌళి కాంబోలో తెరకెక్కబోయే ప్యాన్ వరల్డ్ మూవీ జనవరిలో మొదలవుతుందనే మాట…
ఆంధ్రుల రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. 2014లో…
కారణాలు లేవని పేర్కొంటూనే.. రాజకీయాల నుంచి తప్పుకొన్నారు మాజీ ఐఏఎస్ అధికారి ఏఎండీ ఇంతియాజ్. వైసీపీకి ఆయన గుడ్ బై…
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలంలో కొన్ని రోజుల కిందట వెలుగు చూసిన డెడ్ బాడీ డోర్ డెలివరీ…
బాలీవుడ్ డెబ్యూ స్పెషల్ గా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. ఎందుకంటే అదిచ్చే ఫలితాన్ని బట్టే మార్కెట్ తో పాటు అవకాశాలు…