ప్రేక్షకులు చాలు బాబోయ్ కొంచెం బ్రేక్ ఇవ్వండి అంటున్నా రీ రిలీజుల ప్రవాహం ఆగడం లేదు. నెలకు అయిదారు రానిదే నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు వదిలిపెట్టేలా లేరు. ఈ నెల 31న ఇయర్ ఎండింగ్ సందర్భంగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ పవన్ కళ్యాణ్ బద్రి విడుదలను ప్లాన్ చేసుకున్నారు.
ఇంతలో ఏమైందో దాన్ని పక్కకు తప్పించేసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఫిక్స్ చేసుకున్న ఖుషిని ప్రీ పోన్ చేసి ఈ డిసెంబర్ 31కి తీసుకొస్తున్నారు. కారణాలు బయటికి చెప్పడం లేదు కానీ రీ మాస్టరింగ్ వ్యవహారాలతో పాటు హక్కులకు సంబంధించిన ఏవో లావాదేవీలు ఈ మార్పుకు దారితీసినట్టు టాక్
ఖుషితో పవన్ ఫ్యాన్స్ కి మంచి ఎమోషనల్ కనెక్షన్ ఉంది. 2001లో ఏఏం రత్నం నిర్మాతగా రూపొందిన ఈ సూపర్ కూల్ లవ్ ఎంటర్ టైనర్ అదే టైటిల్ తో తమిళంలో రూపొందిన విజయ్ బ్లాక్ బస్టర్ కి రీమేక్.
ఫ్యాక్షనిజం ఫార్ములా రాజ్యమేలుతున్న టైంలో హీరో హీరోయిన్ల ఈగోలతో కథను అల్లుకుని దర్శకుడు ఎస్జె సూర్య ఇచ్చిన స్వీట్ అండ్ క్యూట్ స్టోరీ ఇండస్ట్రీ రికార్డులను అందించింది. నిర్మాణ సంస్థ సూర్య మూవీస్ మీద కనక వర్షం కురిసింది. ఆ తర్వాత ఆయన మళ్ళీ పవన్ తో బంగారం తీసి నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఆ బంధమే ఇప్పుడు హరిహర వీరమల్లు లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్టుకి దారి తీసింది
వినడానికి బాగానే ఉంది కానీ ఖుషి మళ్ళీ జల్సా తరహాలో కలెక్షన్ల ట్రెండ్ సృష్టిస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే పోకిరి టైంలో కనిపించిన ఈ రీ రిలీజుల హంగామా చెన్నకేశవరెడ్డి దాకా బాగానే సాగింది కానీ ఆ తర్వాతే మెల్లగా రివర్స్ కొడుతోంది.
ఇటీవలే ప్రేమదేశం, మాయాబజార్ లకు దక్కిన పరాభవం గుర్తే. మరి ఖుషి లాంటి ఐకానిక్ మూవీని మళ్ళీ అనుభూతి చెందడానికి ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఏ మేరకు ఆసక్తి చూపిస్తారో వసూళ్లను చూశాక అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు అదే డేట్ కి సింగల్ షోతో చిరంజీవి గ్యాంగ్ లీడర్ ని ప్లాన్ చేశారు. ఇంకెన్ని చూడాల్సి వస్తుందో.
This post was last modified on December 19, 2022 3:36 pm
యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల వారసుడు రోషన్ కనకాల నటించిన మోగ్లీకి ఎదురీత తప్పడం లేదు. అఖండ తాండవం…
ఇంకో అయిదు రోజుల్లో అవతార్ 3 ఫైర్ అండ్ యాష్ విడుదల కాబోతోంది. మాములుగా అయితే ఈపాటికి అడ్వాన్స్ ఫీవర్…
40 % ఓటు బ్యాంకు గత ఎన్నికల్లో వచ్చిందని చెబుతున్న వైసిపికి అదే ఓటు బ్యాంకు నిలబడుతుందా లేదా అన్నది…
ఇంకో ఇరవై నాలుగు రోజుల్లో సంక్రాంతి హడావిడి మొదలైపోతుంది. ఒకటి రెండు కాదు స్ట్రెయిట్, డబ్బింగ్ కలిపి ఈసారి ఏకంగా…
అఖండ 2 బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో తమన్ మాటలు చర్చకు దారి తీస్తున్నాయి. ఇండస్ట్రీలో యూనిటీ లేదని,…
ఎవరో జ్వాలలు రగిలించారు, వేరెవరో దానికి బలి అయ్యారు అంటూ ఒక పాత పాట ఉంటుంది. ఎన్ని తరాలు మారినా…