ప్రపంచ సినీ చరిత్రలోనే అత్యధిక అంచనాలతో, అత్యంత భారీ స్థాయిలో విడుదలైన సినిమా ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’. 13 ఏళ్ల కిందట అసాధారణ విజయాన్నందుకుని, ప్రపంచ సినీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసిన ‘అవతార్’కు కొనసాగింపుగా ఎన్నో ఏల్లు కష్టపడి ఈ సినిమా తీశాడు జేమ్స్ కామెరూన్.
దాదాపు మూడు వేల కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రానికి కనీ వినీ ఎరుగని స్థాయిలో బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు 2 బిలియన్ డాలర్లు.. అంటే రూపాయల్లో రూ.16 వేల కోట్లు కావడం గమనార్హం. స్వయంగా కామెరూనే ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఈ సినిమా ఆ మార్కును అందుకుని హిట్ అనిపించుకుంటేనే తాను అవతార్-4, 5 పార్ట్స్ తీస్తానని.. లేదంటే ఇప్పటికే మేకింగ్ దశలో ఉన్న ‘అవతార్-3’తో ఆపేస్తానని కామెరూన్ ప్రకటించాడు. ఐతే సినిమాకున్న హైప్ ప్రకారం బ్రేక్ ఈవెన్ కష్టమేమీ కాదనుకున్నారు ట్రేడ్ పండిట్లు.
కానీ మిక్స్‌డ్ రివ్యూస్‌తో మొదలైన ‘అవతార్-2’ బ్రేక్ ఈవెన్ మార్కును అందుకోవడం కష్టమే అనిపిస్తోంది. తొలి రోజు ఈ చిత్రం 160 మిలియన్ డాలర్ల దాకా కలెక్ట్ చేసింది. వీకెండ్ అయ్యేసరికి వరల్డ్ వైడ్ సినిమా 400 మిలియన్ డాలర్ల మార్కును దాటేలా కనిపిస్తోంది.
వసూళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 500 మిలియన్ డాలర్ల మార్కును దాటేలా లేవు. ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇప్పుడు కొత్త సినిమాల సందడి రెండు మూడు వారాలకు పరిమితం అవుతోంది. తొలి వీకెండ్లో 50 శాతానికి పైగా రికవరీ ఉంటేనే సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఛాన్సుంటుంది.
కానీ ‘అవతార్-2’ తొలి వీకెండ్లో టార్గెట్లో నాలుగో వంతు మాత్రమే కలెక్ట్ చేసేలా కనిపిస్తోంది. ఈ చిత్రం కనీసం నెల రోజుల పాటు నిలకడగా వసూళ్లు రాబడితే తప్ప 2 బిలియన్ మార్కును అందుకోవడం అసాధ్యం. కానీ తొలి వీకెండ్ తర్వాత వసూళ్లు డ్రాప్ అయ్యేలాగే కనిపిస్తున్నాయి. ఫుల్ రన్లో 1.5 బిలియన్ డాలర్ల మార్కును అందుకోవడం కూడా కష్టమే అనిపిస్తోంది.
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో రూపొంది, అత్యధిక అంచనాలతో విడుదల కాబోతోంది ‘ది ప్యారడైజ్’ సినిమా. ఈ…
సినిమా అనేది అత్యంత శక్తిమంతమైన మాధ్యమం. మంచైనా, చెడైనా జనాల్లోకి చాలా వేగంగా తీసుకువెళ్లే మీడియం ఇది. దీన్ని మంచి…
ఒక డాక్టర్ ఇంటి మీద ఏసీబీ దాడులు చేయడమే ఒక సెన్సేషన్ అయితే ఆయన ఇంట్లో కోట్ల రూపాయల కట్టలు…
గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…
ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…
జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…