వచ్చే వారం విడుదల కాబోతున్న ధమాకా మీద భీభత్సమైన హైప్ లేకపోయినా క్రమంగా అంచనాలు ఎగబాకుతున్నాయి. ట్రైలర్ వచ్చాక అభిమానులు ఈసారి టార్గెట్ మిస్ అవ్వదని నమ్ముతున్నారు. అవతార్ 2 ది వే అఫ్ వాటర్ కు కేవలం వారం గ్యాప్ తో రావడం వల్ల ఒకవేళ దాని బ్లాక్ బస్టర్ టాక్ తమ హీరో ఓపెనింగ్స్ కి ఇబ్బంది కలిగిస్తుందేమోనని టెన్షన్ పడ్డారు కానీ ఇంకే బెంగ అక్కర్లేదు. ఎందుకంటే అవతార్ 2 సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ తో నడుస్తున్నప్పటికీ వారం కంటే ఎక్కువ ఈ స్థాయి దూకుడు ఉండకపోవచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. లెన్త్ పరంగా, ఫస్ట్ పార్ట్ తో పోలిక పరంగా డివైడ్ టాక్ వచ్చిన మాటా వాస్తవమే.
సో డిసెంబర్ 23కి రవితేజకు రెండు ప్రధాన అపోజిషన్లు ఉంటాయి. మొదటిది నిఖిల్ 18 పేజెస్. అది కంప్లీట్ లవ్ స్టోరీ కాబట్టి మాస్ అటువైపు వెళ్తారనే టెన్షన్ అక్కర్లేదు. పైగా కార్తికేయ 2 లాగా అదేమీ గ్రాఫిక్స్ తో వస్తున్న మూవీ కాదు. రెండోది లాఠీ. ఒకప్పుడు మార్కెట్ ఎంజాయ్ చేసిన విశాల్ దీంతో బలమైన కంబ్యాక్ ఆశిస్తున్నాడు. అందుకే విడుదల వాయిదా పడుతూ వచ్చినా ఎట్టకేలకు క్రిస్మస్ ని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇది ఆహా ఓహో అనే టాక్ వస్తే తప్ప నిలదొక్కుకోవడం ఈజీ కాదు. ఇక రణ్వీర్ సింగ్ సర్కస్ మీద నార్త్ ఆడియన్స్ కే పెద్దగా అంచనాలు లేనప్పుడు మాస్ రాజాకు టెన్షన్ ఎందుకు
ఎలా చూసుకున్నా ధమాకా కనక హిట్ కొడితే కేవలం ఇరవై రోజుల గ్యాప్ తో వచ్చే వాల్తేర్ వీరయ్యకు కూడా ప్లస్ అవుతుంది. అది పూర్తిగా చిరంజీవి సినిమానే అయినప్పటికీ మాస్ మహారాజా ఫ్యాన్స్ సపోర్ట్ దక్కుతుంది కాబట్టి రెండు సక్సెస్ లు రావడం కన్నా వాళ్ళు కోరుకునేది ఏముంటుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ గాయాలను పూర్తిగా మాసిపోయేలా ధమాకా హిట్ అవుతుందనే నమ్మకం రవితేజలో కనిపిస్తోంది. జింతాక్ పాట చార్ట్ బస్టర్ కావడం, శ్రీలీల గ్లామర్ వర్కౌట్ అయ్యేలా ఉండటం, అన్నింటిని మించి రెండు షేడ్స్ తో ట్రైలర్ ని కట్ చేసిన తీరు పాజిటివ్ వైబ్రేషన్సే ఇచ్చింది. చూడాలి మరి ఎలాంటి బాక్సాఫీస్ ధమాకా దక్కనుందో.