Movie News

పాపం జబర్దస్త్ కమెడియన్

‘జబర్తస్త్’ షో ద్వారా పేరు, డబ్బు సంపాదించుకుని ఆర్థికంగా ఊహించని స్థాయికి వెళ్లిన కమెడియన్ల గురించి యూట్యూబ్‌లో స్టోరీస్ చూస్తుంటాం. అలాగే ఈ ప్రోగ్రాంలో ఫేమ్ వచ్చాక అనుకోకుండా జీవితం బాధాకరమైన మలుపు తిరిగి దీన స్థితిలో ఉన్న కమెడియన్ల గురించి కూడా అప్పుడప్పుడూ కొన్ని కథలు వింటుంటాం.

పంచ్ ప్రసాద్ అనే జబర్దస్త్ కమెడియన్ కిడ్నీ వ్యాధితో నడవలేని స్థితికి చేరుకున్న వైనం గురించి వస్తున్న వార్తలు, కథనాలు చాలామందితో కంటతడి పెట్టించాయి. ఇప్పుడు ఇలాగే మరో కమెడియన్ తీవ్ర ఇబ్బందికర స్థితిలో ఉన్న విషయం వెలుగులోకి వచ్చింది.

అతనే.. వినోద్. ‘జబర్దస్త్’లో లేడీ గెటప్‌తో బోలెడన్ని ఎపిసోడ్లు చేసి పేరు సంపాదించాడు వినోద్. అతణ్ని చూస్తే నిజంగా అమ్మాయేమో అని భ్రమపడ్డ వాళ్లు చాలామందే ఉన్నారు. అతను ప్రధానంగా చమ్మక్ చంద్ర స్కిట్లలో నటించేవాడు. ఐతే చంద్ర జబర్దస్త్ మానేశాక అతను కూడా కనుమరుగైపోయాడు.

కొన్నేళ్ల నుంచి ఏమయ్యాడో తెలియని వినోద్ ఇప్పుడు విచారకర పరిస్థితిలో మీడియాలో కనిపిస్తున్నాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బక్క చిక్కి గుర్తు పట్టలేని స్థితికి చేరుకున్నాడు వినోద్. ఓ ఇంటర్వ్యూలో తన అనారోగ్యం గురించి వెల్లడిస్తూ.. ‘‘నాకు లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ వచ్చింది. దీని వల్లే వీక్ అయిపోయాను. ఎక్కువగా ప్రయాణాలు చేయడం.. ఏసీ గదుల్లో ఉండడం.. చల్లటి నీళ్లు ఎక్కువ తాగడం, జంక్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం దెబ్బ తింది. టెస్టులు చేయించుకున్నాక లంగ్స్ ఇన్ఫెక్షన్ అని తేలింది.

మొదట్లో ఈ సమస్య వల్ల నడవడం కూడా కష్టమైంది. ఆ సమయంలో నా కుటుంబం అండగా నిలబడింది. ఎక్కువ మందులు వాడడం వల్ల నా జుట్టు పోయింది. రెగ్యులర్‌గా చికిత్స తీసుకున్నాక కోలుకుంటున్నా. ఇప్పుడు నా పరిస్తితి కొంచెం మెరుగ్గానే ఉంది’’ అని వినోద్ చెప్పుకొచ్చాడు.

This post was last modified on December 16, 2022 8:27 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jabardasth

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

1 hour ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

1 hour ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago