Movie News

డబుల్ ప్యాకేజీలో మాస్ ధమాకా

మాస్ మహారాజా రవితేజ హీరోగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న ధమాకా మీద ఫ్యాన్స్ లో మంచి అంచనాలున్నాయి. దాని తగ్గట్టే మ్యూజిక్ ఆల్రెడీ జనంలోకి బాగా వెళ్లిపోయింది. ముఖ్యంగా జింతాక్ జిజ్జిన సాంగ్ ఓ రేంజ్ లో ఛార్ట్ బస్టర్ అయ్యింది. క్రాక్ లాంటి పెద్దసక్సెస్ తర్వాత ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ రెండూ తీవ్రంగా నిరాశ పరచడంతో అభిమానులు ఆశలన్నీ దీని మీదే పెట్టుకున్నారు. పెళ్లి సందడితో పరిచయమై సూపర్ డిమాండ్ లో ఉన్న శ్రీలీల హీరోయిన్ కావడం మరో ఆకర్షణ. ఇవాళ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

స్టోరీని చెప్పీ చెప్పనట్టు మొత్తం గుట్టు విప్పేశారు. ఇందులో ఇద్దరు రవితేజలు. ఒకరేమో జాబు లేక గాలికి ఖాళీగా తిరిగే బాపతు. రెండో వాడేమో తండ్రి సృష్టించిన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుతూ యువతకు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలనే లక్ష్యంతో కష్టపడేవాడు. అమ్మడేమో పగలు ఒకణ్ణి సాయంత్రం మరొకణ్ణి ప్రేమించేస్తుంది. మధ్యలో శత్రువులు వాళ్ళు విసిరే సవాళ్లు వగైరా వగైరా అన్నీ మాస్ యాక్షన్ ప్యాకేజీలో ఏమేం ఉండాలో అన్నీ దిట్టంగా సర్దేశారు. అయితే నిజంగా ఇది డబుల్ ఫోటో బొమ్మనా లేక ఒక రవితేజ ఇద్దరిలా ప్రవర్తిస్తూ ఆడియన్స్ కి షాక్ ఇస్తాడా అనేది సస్పెన్స్.

ఎప్పటిలాగే రవితేజ ఎనర్జీ ధమాకాలోనూ బాగా ఎక్స్ ప్లోర్ అయ్యింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో మరోసారి ఫ్యాన్స్ కి ఏం కావాలో దాన్ని అందించే ప్రయత్నం చేశారు. త్రినాధరావు రెగ్యులర్ టెంప్లేట్ లో వెళ్లినట్టు అనిపించినా సీన్స్ లో ఇంటెన్సిటి, సందర్భానుసారంగా పేల్చిన కామెడీ, యాక్షన్ బ్లాక్స్ తతిమ్మా అన్నీ మాస్ జనాలు కోరుకున్నట్టే ఉన్నాయి. ఇప్పుడీ వీడియో చూపించిన రేంజ్ లోనే బొమ్మ ఉంటే మాత్రం హిట్టు ఖాయమే. రెగ్యులర్ బీట్స్ కి భిన్నంగా భీమ్స్ ఇచ్చిన సంగీతం ప్లస్ అయ్యేలా ఉంది. ఈ 23న రాబోతున్న ధమాకా ఎలాంటి పటాకాలు పేలుస్తుందో చూడాలి మరి.

This post was last modified on December 15, 2022 7:23 pm

Share

Recent Posts

అమరావతిలో 300 కోట్లతో కేటీఆర్ 5 స్టార్ హోటల్?

ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…

6 hours ago

ఆదర్శం వెనుకడుగు వేయడం అవసరమే

ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…

6 hours ago

స‌ల్మాన్ సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం?

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్ల‌యిపోయింది. అస‌లే ఫ్లాపుల్లో ఉన్న అత‌డికి…

6 hours ago

జ్ఞానేష్ పై కేసులు తవ్వుతున్న కాంగ్రెస్

భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…

6 hours ago

55 శాతం తెలంగాణ యువతకు జుట్టు సమస్యలు

యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…

8 hours ago

సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తి!

ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణ‌లోని సైబ‌రాబాద్‌కు ప్ల‌స్‌గా అమ‌రావ‌తిని నిర్మిస్తున్నామ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

8 hours ago