కొన్ని డైలాగులు రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అవుతాయి ఎట్రాక్ట్ చేస్తాయి. అలాగే కొన్ని డైలాగులు రిలీజ్ కి ముందే టీజర్, ట్రైలర్ లో నుండి పాపులర్ అవుతాయి. కానీ ఇటివల సినిమా సెట్స్ పైకి వెళ్ళకముందే ఓ డైలాగ్ పాపులర్ అయింది. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ చేస్తున్న సినిమాలోనిదే ఆ డైలాగ్. ఆచార్య రిలీజ్ టైంలో అనిల్ రావిపూడి రూట్లో కెళ్ళి చిరు , చరణ్ , కొరటాల శివ ను ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశాడు హరీష్ శంకర్.
ఆ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సినిమాలో రాబోయే డైలాగ్ లీక్ చేస్తా అంటూ చిరు ఓ డైలాగ్ చెప్పేశాడు. “మొన్న వీడు మన ఇంటికొచ్చి పెద్దగా అరిచినప్పుడు ఏంటి వీడి ధైర్యం అనుకున్నాను. ఇప్పుడర్థమైంది నడిస్తే వీడి వెనుక లక్ష మంది నడుస్తారు… బహుశా ఇదే వీడి ధైర్యమేమో… కదండీ ఆ లక్ష మందికి వాడు ముందు నడుస్తున్నాడనే దైర్యం” ఇదీ ఆ పవర్ ఫుల్ డైలాగ్. ఈ డైలాగ్ చిరు చెప్పడంతో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందరూ ఈ డైలాగ్ పట్టుకొని కథ అల్లేశారు కూడా.
ఇప్పుడు భవదీయుడు భగత్ సింగ్ కథ మారింది. తమిళ సినిమా తేరి తీసుకొని అటు ఇటు గా కొన్ని కీలక మార్పులతో సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కొన్నేళ్ళ క్రితం ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకొని కొందరు దర్శకులతో తీయాలని ప్రయత్నించిన తర్వాత ఫైనల్ గా ఇప్పుడు పవన్ ని ఒప్పించి హరీష్ శంకర్ చేతిలో పెట్టారని టాక్. మేకర్స్ ఇంకా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా సినిమా టైటిల్ కూడా మార్చారు.
భగత్ సింగ్ కి ముందు ఉన్న భవదీయుడు తీసేసి దానికి ఉస్తాద్ అనే పదం చేర్చారు. మరి ఈ సినిమాలో చిరు లీక్ చేసి చెప్పిన హరీష్ శంకర్ పవర్ ఫుల్ డైలాగ్ ఉంటుందా ? లేదా అని పవన్ అభిమానులు సందేహ పడుతున్నారు. ఇప్పుడు కచ్చితంగా హరీష్ ఈ డైలాగ్ సినిమాలో ఎక్కడో ఓ చోట పెట్టాల్సిందే లేదంటే ఫ్యాన్స్ నిరాశ పడటం ఖాయం.
This post was last modified on December 14, 2022 8:02 pm
ఖేల్ రత్న అవార్డులు: గుకేశ్, మను బాకర్ సహా నలుగురికి గౌరవం భారత ప్రభుత్వం 2024 సంవత్సరానికి గాను మేజర్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన అభిమానులకు అద్భుత సందేశం ఇచ్చారు. తనను అభిమానిం చేవారు... తప్పకుండా పాటించాలని…
ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్, మోస్ట్ హైప్డ్ మూవీకి ఈ రోజే ముహూర్త వేడుక ముగిసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు…
ఇప్పుడంతా ఇంటర్ నెట్ ప్రపంచం. కొన్ని నిముషాలు మొబైల్ డేటా లేకపోయినా, ఇంట్లో వైఫై పనిచేయకపోయినా ఏదో భూమి బద్దలైపోయి…
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…