Mrunal Thakur
ఈ మధ్య కాలంలో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో బలంగా ముద్రించుకుపోయిన హీరోయిన్ పాత్ర ఏది అంటే.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ చేసిన నూర్జహాన్ అలియాస్ సీత క్యారెక్టరే. దర్శకుడు హను రాఘవపూడి ఆ పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దితే.. ఆ పాత్రకు అవసరమైన అందం, స్క్రీన్ ప్రెజెన్స్, నటనతో దానికి ప్రాణం పోసింది మృణాల్ ఠాకూర్. ఇంతందం దారి మళ్లిందా అంటూ అందులో హీరో హీరోయిన్ని చూసి పాడితే.. మృణాల్‌ను చూసి కుర్రాళ్లందరూ అదే పాట పాడారు.
ఇన్నాళ్లూ హిందీలో సినిమాలు చేస్తుండగా ఈ అమ్మాయిని మనం గుర్తించలేదే అనుకున్నారు. హిందీలో కొన్ని పెద్ద చిత్రాల్లో నటించినప్పటికీ.. ‘సీతారామం’కు వచ్చినంత గుర్తింపు మృణాల్‌కు మరే సినిమాలోనూ రాలేదంటే అతిశయోక్తి కాదు. మృణాల్ విషయంలో సోషల్ మీడియా స్పందించిన తీరు చూస్తే ఆమె తెలుగులో బిజీ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారు.
ఐతే ‘సీతారామం’ విడుదలై నాలుగు నెలలు అవుతున్నా మృణాల్ తెలుగులో మరో సినిమాకు సంతకం చేయలేదు. మామూలుగా హీరోయిన్ల కెరీర్ స్పాన్ తక్కువ కాబట్టి ఒక హిట్ పడగానే వాళ్లు తమ వద్దకు వచ్చిన అవకాశాలను వెంటవెంటనే ఒప్పేసుకుంటారు. ఇక తెలుగులో హీరోయిన్ల కొరత సంగతి తెలిసిందే కాబట్టి మృణాల్ కోసం దర్శక నిర్మాతలూ క్యూ కట్టే పరిస్థితి ఉండాలి. కానీ మృణాల్ విషయంలో ఇలా జరుగుతున్న సంకేతాలేమీ కనిపించడం లేదు.
‘సీతారామం’ లాంటి క్లాసిక్ చేశాక ఆషామాషీ సినిమా చేస్తే బాగుండదని మృణాలే తన వద్దకు వచ్చిన పాత్రలను తిరస్కరిస్తోందా.. లేక ఆమెకు తగ్గ పాత్రలు లేక.. తమ పాత్రలకు ఆమె సూటవదని భావించి ఫిలిం మేకర్స్ ఎవరూ తనను సంప్రదించలేదా అన్నది అర్థం కావడం లేదు. మొత్తానికి మృణాల్ పేరు అయితే ఇప్పుడు ఇటు ఇండస్ట్రీలో, అటు సోషల్ మీడియా సర్కిల్స్‌లో వినిపించడం లేదు.
This post was last modified on December 13, 2022 4:23 pm
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…