గత కొన్నేళ్లలో రాజమౌళి ఇంతింతై అన్నట్లుగా ఎలా ఎదిగిపోయాడో అందరూ చూస్తూనే ఉన్నాం. ఆయన ఎదుగుదల చూసి సంతోషించిన వాళ్లు ఎక్కువమందే అయినా అది చూసి ఓర్వలేక ఏడుస్తున్న వాళ్లూ లేకపోలేదు. సొంత ఇండస్ట్రీలోనే ఆయన్ని డీగ్రేడ్ చేయడానికి ప్రయత్నించేవాళ్లున్నారు. ఇక బాలీవుడ్, కోలీవుడ్ వాళ్ల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ‘బాహుబలి’ సాధించిన భారీ విజయం చూసి తట్టుకోలేక ఆ సినిమాను వీలు చిక్కినపుడల్లా తక్కువ చేయడానికే చూస్తుంటారు.
‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తీసిన ‘ఆర్ఆర్ఆర్’ కూడా అదే స్థాయిలో బాక్సాఫీస్ విజయం సాధించడమే కాక ఆస్కార్ అవార్డులకు బలమైన పోటీదారుగా మారేలా కనిపిస్తోంది. భారత్ తరఫున ఈ చిత్రాన్ని ఆస్కార్ అవార్డులకు నామినేట్ చేయకపోయినా.. చిత్ర బృందం సొంతంగా పోటీలో నిలిచింది. రాజమౌళి రెండు నెలలు యుఎస్‌లోనే ఉండి తన సినిమా కోసం క్యాంపైన్ కూడా చేశాడు.
కట్ చేస్తే ఇటీవలే ప్రతిష్టాత్మక ‘క్రిటిక్స్ ఛాయిస్’ బెస్ట్ డైరెక్టర్‌గా రాజమౌళి ఎంపికయ్యాడు. ఈ అవార్డు అందుకున్న 22 మందిలో 16 మంది తర్వాత అకాడమీ పురస్కారం అందుకోవడం గమనార్హం. కాగా ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ అవకాశాలను మరింత పెంచుతూ ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డులకు రెండు విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ కావడం గమనార్హం. ఆస్కార్ తర్వాత అంత ప్రతిష్టాత్మక అవార్డులివి. ఇందులో బెస్ట్ నాన్-ఇంగ్లిష్ మూవీ, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ నామినేట్ అయింది. ఇక్కడ అవార్డులు గెలిచే అవకాశాలు మెరుగ్గానే ఉన్నాయంటున్నారు.
ఐతే ఈ అవార్డులకు ‘ఆర్ఆర్ఆర్’ను నామినేట్ చేయడంపై బాలీవుడ్ లెజెండరీ ఫిలిం మేకర్ శేఖర్ కపూర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐతే చాలామంది బాలీవుడ్ ఫిలిం మేకర్లలా రాజమౌళిని చూసి ఆయనేమీ అసూయ చెంది, ఆర్ఆర్ఆర్‌ను డీగ్రేడ్ చేయట్లేదు. ఈ చిత్రాన్ని బెస్ట్ పిక్చర్ విభాగంలోనే నామినేట్ చేయాల్సిందని, నాన్-ఇంగ్లిష్ విభాగంలో కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అయినా సరే పర్వాలేదంటూ రాజమౌళికి కంగ్రాట్స్ చెప్పాడు. ‘బాహుబలి’ రిలీజ్ టైంలో బాలీవుడ్ గప్‌చుప్ అన్నట్లు ఉండిపోగా.. రాజమౌళిని చూసి బాలీవుడ్ పాఠాలు నేర్చుకోవాలంటూ ఈ లెజెండరీ ఫిలిం మేకర్ క్లాస్ పీకడం, జక్కన్నను కొనియాడడం గమనార్హం.
This post was last modified on December 13, 2022 12:08 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…