సోషల్ మీడియా అంటే ఎవరిని ఏమైనా అనేయొచ్చు.. ఎంత పెద్ద కామెంట్ అయినా చేయొచ్చు.. ఫేక్ ఐడెంటిటీతో చంపేస్తా, రేప్ చేస్తా అని బెదిరింపులు కూడా చేయొచ్చు.. ఇదీ కొందరు నెటిజన్ల తీరు. సెలబ్రెటీలనుద్దేశించి ఇలాంటి కామెంట్లు చేయడం చాలా మామూలు విషయం అయిపోయింది.
సెలబ్రెటీలు కూడా ఇలాంటి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటారు. పట్టించుకున్నా ఎంత మందినని డీల్ చేస్తారు. కానీ వదిలేస్తే మరి శ్రుతి మించిపోయి కామెంట్లు, హెచ్చరికలు చేస్తున్నారు నెటిజన్లు. గత నెల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినప్పటి నుంచి అతడి ప్రేయసి రియా చక్రవర్తి ఇలాగే టార్గెట్ అయింది నెటిజన్లకు.
సుశాంత్ ఆత్మహత్యకు ఆమే బాధ్యురాలు అంటూ తనపై విరుచుకుపడుతున్నారు. ఈ దాడి ఎంతకీ ఆగకపోవడంతో తాజాగా రియా సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఓ నెటిజన్ నుంచి ఆమెకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ అయ్యాయి. నువ్వు ఆత్మహత్య చేసుకుని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తా అంటూ ఆ నెటిజన్ నుంచి రియాకు బెదిరింపులు వచ్చాయి.
దీని తాలూకు స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేసిన రియా.. తాను ఎంత ఓపిక పడుతున్నప్పటికీ ఇలాంటివి బెదిరింపులు ఆగట్లేదని.. ఇలా బెదిరించే వాళ్లకు ఆ వ్యాఖ్యల తాలూకు తీవ్రత తెలుసా అని ప్రశ్నించింది. వీరిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది. ఇకనైనా ఆమెకు ఈ వేధింపులు ఆగుతాయేమో చూడాలి.
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…