లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన బాలీవుడ్ బ్యూటీ..!

బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ముంబై లోకల్ ట్రైన్ లో ప్రయాణించిన వీడియోని పోస్ట్ చేసింది. అంత పెద్ద సినీనటి ఒక లోకల్ ట్రైన్ లో ప్రయాణించడం ఏమిటి అని అనుకుంటున్నారా..?

విషయం ఏమిటంటే సారా అలీ ఖాన్ ముంబైలో ఉన్న అధిక ట్రాఫిక్ నుండి తప్పించుకునేందుకు ఇలా లోకల్ ట్రైన్ ను ఎంచుకుంది. “సమయాన్ని పొదుపు చేసిందుకు, ట్రాఫిక్ జామ్ పాలుకాకుండా ఇలా లోకల్ ట్రైన్ లో వస్తున్నాను” అని క్యాప్షన్ పెట్టేసింది సారా.

అయితే ఈ ప్రయాణం వల్ల తనకు కొద్దిగా వెన్ను నొప్పి వచ్చినట్లు కూడా తెలిపింది. మరలా తనే ‘No Pain No Gain’ అంటూ కష్టపడాల్సిన ఆవశ్యకతను కూడా తెలిపింది. ఇక ట్రైన్ దిగిన తరువాత ఆమె ఒక ఆటోలో తన ఇంటికి చేరుకోవడం గమనార్హం.

మొత్తానికి నీలం రంగు చుడీదార్ లో అలా ప్రజలకు దర్శనం ఇచ్చిన సారా ప్రయాణం సమయంలో ఎలాంటి మేకప్ వేసుకోకపోవడం గమనార్హం. ఇక నెటిజన్లు కామెంట్లలో ఆమె సాదాసీదా జీవనశైలిని అభినందించారు. ఒక పక్క తోటి నటులు తన ఖరీదైన కార్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే సారా అలీ ఖాన్ మాత్రం లోకల్ ట్రైన్ లో ప్రయాణించడం వారికి తెగ నచ్చేసింది.