Movie News

రీమేక్ గొడవ.. పవన్ వైపు నుంచి చూద్దామా?


పవన్ కళ్యాణ్ కొత్త సినిమా అనౌన్స్ చేయబోతుంటే సంబరాలు చేసుకోవాల్సింది పోయి అభిమానులు ఆ సినిమా వద్దంటూ గొడవ చేయడం అన్నది ఊహకందని విషయం. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కొత్త సినిమాకు ప్రారంభోత్సవం జరగబోతున్నట్లు ఇలా వార్త బయటికి వచ్చిందో లేదో.. అలా పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక ఉద్యమం మొదలుపెట్టేశారు. ఈ చిత్రం ఇంతకుముందు అనుకున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ అయితే అభిమానుల నుంచి ఏ అభ్యంతరం ఉండేది కాదు. పైగా సంబరాలు చేసుకునేవారు. ఈ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టించి.. తమిళ హిట్ ‘తెరి’ రీమేక్‌ను పట్టాలెక్కించబోతుండమే వారి ఆందోళనకు కారణం. ఈ సినిమా వద్దే వద్దంటూ ట్విట్టర్లో హ్యాష్ ట్యాగ్ పెట్టి లక్షల్లో ట్వీట్లు వేశారు.

వారి ఆగ్రహం చూసి చిత్ర బృందం కొంచెం కంగారు పడి ఉంటుందనడంలో సందేహం లేదు. ఐతే అభిమానుల అభీష్టానికి వ్యతిరేకంగా పవన్ ఎందుకు ఇలా చేస్తున్నాడు.. మరో రీమేక్‌ను ఎందుకు పట్టాలెక్కిస్తున్నాడు అని పవన్ వైపు నుంచి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది.

పవన్ ఇటు రాజకీయాలకు, అటు సినిమాలకు పూర్తి న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉండాలంటే పార్టీని నడిపించడానికి, తన మెయింటైనెన్స్‌ను పెద్ద ఎత్తున డబ్బులు కావాలి. గత పర్యాయం లాగా ఈసారి పైసా ఖర్చు పెట్టకుండా ఎన్నికలకు వెళ్లాలంటే కష్టం. ఓటు కోసం నోటు ఇవ్వకపోయినా ప్రచారానికి ఖర్చవుతుంది. కాబట్టి డబ్బులు సమీకరించుకోవాలి. వేరే నాయకుల్లా అవినీతి చేసినా, వ్యాపారాలు చేస్తున్నా పవన్ సినిమాల గురించి ఆలోచించాల్సిన పని ఉండేది కాదు. బయటి నుంచి ఫండ్స్ తీసుకుంటే వాళ్లకు తర్వాత ఫేవర్ చేయాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో వీలైనంత మేర తన డబ్బులే ఖర్చు పెట్టుకోవాలనుకుంటున్నాడు పవన్. రీఎంట్రీలో పవన్ ఇప్పటికి రెండు సినిమాలే చేశాడు. ఇంకో సినిమా సెట్స్ మీద ఉంది. ఎన్నికల్లోకి పూర్తి స్థాయిలో దిగేలోపు ఇంకో రెండు సినిమాలైనా చేస్తే ఎన్నికలకు అవసరమైన మేర నిధులు సమకూరుతాయన్నది పవన్ ప్లాన్.

మరోవైపు నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకుని వాళ్లకు సినిమా చేయకుండా వెయిట్ చేస్తే వాళ్లు ఇబ్బంది పడతారన్నది కూడా గమనార్హం. అలా అని ఇప్పుడున్న పరిస్థితుల్లో స్ట్రెయిట్ సినిమాలు లైన్లో పెడితే ఆలస్యం అవుతుంది. అందుకే మరో రీమేక్‌ను పట్టాలెక్కిస్తున్నాడు. హరి హర వీరమల్లు పూర్తి కావస్తోంది. ఇంకో రెండు మూడు నెలలు విరామం లేకుండా సినిమాలు చేయాలనుకుంటున్నాడు పవన్. ఆ తర్వాత వారంలో రెండు మూడు రోజుల చొప్పున ఇంకో రెండు మూడు నెలలు నడిపిస్తాడవడట. ఈ టైంలో సుజీత్ సినిమాతో పాటు హరీష్ శంకర్ సినిమాను కూడా సమాంతరంగా పూర్తి చేయాలన్నది ప్రణాళిక. రీమేక్ సినిమా కాబట్టి తనో నెల రోజులు డేట్లు ఇస్తే చాలని అనుకుంటున్నాడు. సుజీత్ సినిమాకు ఇంకో 15 రోజులు అదనంగా డేట్లు ఇవ్వాల్సి రావచ్చు. ఈ రెండు టీంలు పక్కాగా షెడ్యూళ్లు వేసుకుని వీలైనన్ని తక్కువ రోజుల్లో షూటింగ్స్ పూర్తి చేసే ప్రణాళికతో రంగంలోకి దిగబోతున్నాయి. పవన్ పరిస్థితిని కూడా కొంచెం అర్థం చేసుకోవాలని అభిమానులను ఆయన సన్నిహితులు కోరుతున్నారు.

This post was last modified on December 10, 2022 3:01 pm

Share

Recent Posts

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

17 minutes ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

1 hour ago

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

5 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

5 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

6 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

13 hours ago