కేవలం ఏడాదిన్నర వ్యవధిలో ఎన్నికలు వస్తున్నాయి. జనసేనను నడిపించేందుకు అవసరమైన నిధుల కోసం సినిమాలు చేయక తప్పని పరిస్థితి. పోనీ వచ్చిన కథలల్లా ఒప్పుకుందామా అంటే వాటిలో ఏదైనా తేడా వస్తే అభిమానులు నిరాశ చెందడంతో పాటు అవే ప్రత్యర్థులకు విమర్శకులు చేసే అవకాశాన్ని కలిగించవచ్చు.
అందుకే పవన్ కళ్యాణ్ రిస్క్ లేకుండా రీమేక్ గేమ్ ఆడేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. తేరి రీమేక్ కు సంబంధించి అందరూ దర్శకుడు హరీష్ శంకర్ ని వేలెత్తి చూపిస్తున్నారు కానీ నిజానికి తను నిమిత్తమాత్రుడు. భవదీయుడు భగత్ సింగ్ లాంటి పవర్ ఫుల్ స్క్రిప్ట్ ఎప్పుడో సిద్ధంగా ఉంచుకున్న పవర్ స్టార్ ఫ్యాన్.
కానీ ఎక్కువ టైం డిమాండ్ చేసే ఏ ప్రాజెక్టూ ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కు వర్కౌట్ కాదు. అందుకే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చాలా తక్కువ సమయంలో పూర్తి చేయగలిగారు. ఒరిజినల్ వెర్షన్ కి కొన్ని మార్పులు చేయడం వల్ల బడ్జెట్ తో పాటు ఏ అంశంలోనూ ఇబ్బంది లేకుండా అవి సేఫ్ గా బయట పడ్డాయి.
వినోదయ సితం రీమేక్ గురించి ఆలోచించినా, తేరి చేయాలనే నిర్ణయానికి రావాల్సి వచ్చినా ఇదంతా తప్పకే చేస్తున్నాడు. అభిమానులు ఇన్నేసి రీమేక్స్ లో నటించడం ఇష్టం లేదు. నిజమే. అలా అని చూడటం మానేయరుగా. సినిమా నిజంగా బాగుంటే ఇదే సోషల్ మీడియాలో వాళ్లే భుజాన ఎత్తుతారు.
తీసుకునే నిర్ణయాలు వచ్చే ఫలితాలు అన్నింటికి మొదటి బాద్యుడు పవన్ కళ్యాణ్ తప్ప వేరొకరు కాదు. ఏ కథ చేసినా కనీసం వంద కోట్లకు పైగా మార్కెట్ జరుగుతున్న నేపథ్యంలో వేగంగా ఏవి పూర్తవుతాయో వాటికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వస్తుంది.
ఒకవేళ థియేటర్లో పెద్దగా వర్కౌట్ కాకపోయినా డిజిటల్ శాటిలైట్ తో లాభాలు గ్యారెంటీగా వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఒకరకంగా ఇలా చేయడమూ కరెక్టే అనిపిస్తుంది. హరిహర విరమల్లు లాంటి విజువల్ గ్రాండియర్, సుజిత్ తో ఫిక్స్ చేసిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఎలాగూ ఉన్నాయి కాబట్టి తేరి అయినా మరొకటైనా తప్పుకాదనేది పవన్ ఆలోచన కాబోలు
This post was last modified on December 9, 2022 12:51 pm
ఒకప్పుడు ఏ మాయ చేశావే, ఘర్షణ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గౌతమ్ మీనన్ ఇప్పుడు మనుగడ…
టాలీవుడ్లో చాలా ఏళ్ల నుంచి సరైన బాక్సాఫీస్ విజయం లేక ఇబ్బంది పడుతున్న పెద్ద సినీ ఫ్యామిలీస్‌లో అక్కినేని వారిది…
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఏదైనా చెబితే అది జరిగేలా పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ, ఎందుకో కానీ.. ఆయన…
గత ఏడాది డిసెంబరు మొదటి వారంలో భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పుష్ప: ది రూల్’ దేశవ్యాప్తంగా…
వైసీపీలోనే కాకుండా దాదాపుగా తెలుగు నేలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల్లో ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయ సన్యాసంపైనే…
దక్షిణాదిలో లెజెండరీ డైరెక్టర్స్ అని ప్రస్తావించాల్సిన వాళ్లలో ఖచ్చితంగా రాయాల్సిన పేరు మణిరత్నం. సౌత్ సినిమా దశాదిశను మార్చేలా ఆయన…