ఈ మధ్య స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఓ వివాదంలో చిక్కుకోవడం తెలిసిందే. కన్నడ సినిమాలను గౌరవించట్లేదన్న ఆరోపణలతో ఆమెను శాండిల్ వుడ్ నిర్మాతలు కన్నడ చిత్రాల నుంచి నిషేధిస్తున్నట్లుగా జో్రుగా ప్రచారం జరిగింది. కన్నడ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన కాంతార సినిమాను చూశారా అని మీడియా వాళ్లు అడిగితే లేదని సమాధానం చెప్పడమే ఇందుకు కారణంగా చూపించారు.
అలాగే కాంతార దర్శకుడు రిషబ్ శెట్టిని అగౌరవపరిచేలా ఆమె మాట్లాడిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఓ ఇంటర్వ్యూలో రష్మిక గురించి రిషబ్ కొంచెం వ్యంగ్యంగా స్పందించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై తాజాగా రష్మిక స్పందించింది. తన మీద కన్నడ పరిశ్రమ నిషేధం విధిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆమె స్పష్టం చేసింది.
అంతే కాక తాను కాంతార సినిమా చూశానని.. చిత్ర బృందాన్ని అభినందించడం కూడా జరిగిందని రష్మిక వెల్లడించడం గమనార్హం. ఈ మొత్తం వివాదంపై రష్మిక స్పందిస్తూ.. కాంతార సినిమా విషయంలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించారు. నేను ఆ చిత్రం చూశాను. తర్వాత ఆ టీంను అభినందిస్తూ మెసేజ్ కూడా పెట్టా.
నా వ్యక్తిగత విషయాలను కెమెరా పెట్టి ప్రపంచానికి చూపించలేను. నా మెసేజ్‌లను బయటకు రిలీజ్ చేయలేను. నా వ్యక్తిగత జీవితం, విషయాల గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వృత్తిపరంగా ఏం చేస్తున్నానో అది మాత్రం చెప్పడం నా బాధ్యత. నా మీద కన్నడ ఇండస్ట్రీలో ఎలాంటి నిషేధం విధించలేదు అని రష్మిక స్పష్టం చేసింది. త్వరలోనే విజయ్ వారసుడు మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న రష్మిక.. పుష్ప-2 సహా కొన్ని క్రేజీ ప్రాజెక్టుల్లో నటిస్తోంది.
This post was last modified on December 9, 2022 8:28 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…