దసరా తర్వాత Tollywood బాక్సాఫీస్ డల్లయిపోయింది. అందులోనూ నవంబరులో అయితే పరిస్థితి ఏమంత బాగా లేదు. డిసెంబరు తొలి వారంలో ‘హిట్-2’తో మళ్లీ కొంచెం సందడి మొదలైంది. కానీ ఈ వారం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పేరుకు రికార్డు స్థాయిలో 17 సినిమాలు రిలీజవుతున్నాయి కానీ.. వాటిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నవి తక్కువే.
‘Gurthunda Seethakalam’ ఒక్కటే కొంచెం చెప్పుకోదగ్గది. వచ్చే వారం బాక్సాఫీస్‌ను మొత్తంగా ‘Avathaar 2’ రాసిచ్చేశారు. పోటీగా ఏ సినిమాలూ రిలీజ్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఐతే తర్వాతి వారం క్రిస్మస్ వీకెండ్లో మాత్రం మళ్లీ బాక్సాఫీస్ కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.
Sankranthi కంటే ముందు క్రిస్మస్‌కు మినీ విందు చూడబోతున్నాం. ఆ పండక్కి మాస్ మహరాజా రవితేజ సినిమా ‘ధమాకా’ రాబోతుండడం, అది పక్కా మాస్ మసాలా చిత్రంలా కనిపిస్తుండడంతో బాక్సాఫీస్ కళకళలాడే అవకాశం కనిపిస్తోంది.
రవితేజ మళ్లీ మాస్ రూట్లోకి రావడం.. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే.. ఇలా వరుస హిట్లు కొట్టిన త్రినాథ రావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కావడం, రవితేజ సరసన శ్రీలీల లాంటి క్రేజీ హీరోయిన్ నటించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘Dhamaka’కు తోడు ‘18 Pages’ కూడా క్రిస్మస్ వీకెండ్లోనే సందడి చేయబోతోంది.
‘Karthikeya 2’ తర్వాత నిఖిల్-అనుపమ జోడీ నుంచి వస్తున్న సినిమా కావడం.. సుకుమార్ కథతో తెరకెక్కిన చిత్రం కావడంతో దీని మీదా మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా పాటలు కూడా బాగానే ఆకర్షిస్తున్నాయి. ఇవి కాక నయనతార డబ్బింగ్ మూవీ ‘Connect’ యువి లాంటి పెద్ద బేనర్ ద్వారా రిలీజ్ కాబోతోంది.
విశాల్ నటించిన మరో అనువాద చిత్రం ‘లాఠి’ కూడా క్రిస్మస్ వీకెండ్‌కే షెడ్యూల్ అయి ఉంది. మొత్తంగా క్రిస్మస్‌కు బాక్సాఫీస్ కళకళలాడే సూచనలు కనిపిస్తున్నాయి. వీటిలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు సంక్రాంతి వరకు సందడి చేసే అవకాశముంటుంది.
This post was last modified on December 8, 2022 4:23 pm
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…