Movie News

రాత్రయితే కళ్లు కనిపించని హీరో

బ్యాగ్రౌండ్ లేకుండా సినీ రంగంలోకి అడుగు పెట్టి హీరోగా అవకాశం దక్కించుకోవడం అంటే చిన్న విషయం. అందులోనూ ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చి ఓ మంచి సినిమాతో హీరోగా పరిచయం కావడం అంటే ఇంకా అరుదైన విషయం. కిరణ్ అబ్బవరం అనే కొత్త కుర్రాడికి ఇలాంటి అవకాశమే దక్కింది.

షార్ట్ ఫిలింల ద్వారా సత్తా చాటుకుని.. ‘రాజావారు రాణి వారు’ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడీ కుర్రాడు. ఆ సినిమా ప్రశంసలందుకుంది. కిరణ్‌కు కూడా మంచి పేరే వచ్చింది. ఈ సినిమా తర్వాత అతడికి మూడు చిత్రాల్లో కథానాయకుడిగా నటించే అవకాశం దక్కడం విశేషం. అందులో ఒకటి ‘ఎస్ఆర్ కళ్యాణ మండపం’. ‘ట్యాక్సీవాలా’ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ఇందులో కథానాయికగా నటించడం విశేషం. ఇటీవలే దీని ఫస్ట్ లుక్ రిలీజైంది.

దీంతో పాటుగా కిరణ్ నటించిన మరో కొత్త సినిమా ఫస్ట్ లుక్‌ను కూడా లాంచ్ చేశారు. అదే.. సెబాస్టియన్. ఇందులో కిరణ్ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ పాత్రకు సంబంధించి ఓ విశేషం ఉంది. అతడికి రేచీకటి ఉంటుంది. రాత్రి అయితే కళ్లు కనిపించవు. పోలీస్ డ్యూటీలంటే ఉదయం వెళ్లి సాయంత్రానికి ఇంటికి వచ్చేసేలా ఉండవు. ప్రతి రోజూ పొద్దు పొయ్యేదాకా పని చేయాలి. నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి. మరి అలాంటి ఉద్యోగంలో పని చేస్తూ హీరోకు రేచీకటి ఉంటే అతడి పాట్లు మామూలుగా ఉండవు.

చిత్తూరు జిల్లాలోని మదనపల్లె నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. కొత్త దర్శకుడు బాబు తత్వమసి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో పాటు కిరణ్ మరో కొత్త సినిమాలోనూ నటించబోతున్నాడు. దాని వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

This post was last modified on July 16, 2020 2:03 pm

Share

Recent Posts

త్రివిక్ర‌మ్ మొద‌టి డైలాగ్ రాసిందెవ‌రికి?

ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? ర‌చ‌యిత‌గా త‌న తొలి సినిమా స్వ‌యంవ‌రం కాబ‌ట్టి.. ఆ సినిమాకే…

4 hours ago

గ‌న్న‌వ‌రంలో వంశీ సెంటిమెంటు రాజ‌కీయం.. !

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…

5 hours ago

స్వయంభు సమస్యేంటో అంతు చిక్కడం లేదు

నిఖిల్ సిద్దార్థ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమా స్వయంభు. షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. ఫిబ్రవరితో…

5 hours ago

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

9 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

10 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

11 hours ago