Movie News

హిట్-3.. అప్పుడే ఇంత హైపా?

శైలేష్ కొలను.. ఇప్పుడు టాలీవుడ్ హాట్ షాట్ డైరెక్టర్లలో ఒకడు. సీక్వెల్స్, ఫ్రాంచైజీ సినిమాలు అంతగా అచ్చిరాని టాలీవుడ్లో ‘హిట్’ ఫ్రాంచైజీని సూపర్ సక్సెస్ చేసి అందరూ తన గురించి చర్చించుకునేలా చేశాడీ డైరెక్టర్. క్రైమ్, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల విషయంలో తనకున్న పట్టును అతను ‘హిట్: ది ఫస్ట్ కేస్’లోనే చూపించాడు. హాలీవుడ్ ప్రమాణాలకు దగ్గరగా తీర్చిదిద్దిన ఈ థ్రిల్లర్ ఆ జానర్ ప్రియులను బాగానే ఆకట్టుకుంది. కానీ ఓవరాల్‌గా అనుకున్నంతగా కమర్షియల్ సక్సెస్ కాలేదు.

కానీ ‘హిట్: ది సెకండ్ కేస్’లోకి సూపర్ ఫాంలో ఉన్న అడివి శేష్ రావడం.. ఈ సినిమాకు ప్రమోషన్లు గట్టిగా చేయడం, ప్రోమోలు కూడా అదిరిపోయేలా ఉండడం, సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కమర్షియల్‌గా కూడా ‘హిట్-2’ పెద్ద రేంజికి వెళ్లిపోయింది. దీంతో మరింత ఉత్సాహంగా ‘హిట్-3’ చేయడానికి శైలేష్ అండ్ టీం రెడీ అవుతోంది.

ఐతే ‘హిట్-3’కి ఇంకా స్క్రిప్టే పూర్తి కాలేదు. అసలలా సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. కానీ అప్పుడే ఈ సినిమాకు ఓ రేంజి హైప్ ఇచ్చేస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ శైలేష్ కొలను వేస్తున్న ట్వీట్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.ఇంతకుముందు నాని అభిమాని ఒకరు తమ హీరోకు ఎలివేషన్లు మామూలుగా ఉండకూడదని అంటే.. ‘‘చంపేద్దాం బ్రో’’ అని బదులిచ్చిన శైలేష్.. తాజాగా విశ్వక్, నాని, శేష్‌లతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పెద్దదే ప్లాన్ చేస్తున్నాం.

హిట్-3 చాలా పెద్దగా ఉండబోతోంది. ఫైర్ వర్క్స్ లోడింగ్’’ అని ట్వీట్ చేశాడు. అంతటితో ఆగకుండా అర్జున్ సర్కార్‌గా నాని కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసి.. ‘‘నా మాటలు గుర్తు పెట్టుకోండి. ‘హిట్-3’లో అర్జున్ సర్కార్‌తో నెక్స్ట్ లెవెల్ రాంపేజ్ క్రియేట్ చేయబోతున్నా’’ అని ఇంకో ట్వీట్ వేశాడు. ఈ రోజుల్లో ఇలా హైప్ పెంచడం బిజినెస్ పరంగా చాలా అవసరం. కానీ ఇంకా స్క్రిప్టు దశలో ఉన్న సినిమా గురించి ఈ రేంజి హైప్ ఇవ్వడం కరెక్టా.. మరీ ఇలా అంచనాలు పెంచేస్తే, రేప్పొద్దున సినిమా ఆ స్థాయిలో లేకుంటే కష్టం కదా అనే చర్చ నడుస్తోంది.

This post was last modified on December 6, 2022 9:15 pm

Share
Show comments
Published by
Satya
Tags: HITHit 3

Recent Posts

బీజేపీలో పాత సామాన్లు: రాజా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, ఘోషా మ‌హ‌ల్ ఎమ్మెల్యే, వివాదాల‌కు కేంద్రంగా ఉన్న రాజా సింగ్ తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.…

54 minutes ago

హీరో-డైరెక్టర్ ‘పాడు కాస్ట్’ అదిరిపోలా

కేవలం సినిమాలో వినోదం ఉంటే సరిపోదని.. ప్రమోషన్లను కూడా సినిమా థీమ్‌కు తగ్గట్లు సరదాగా డిజైన్ చేసి ప్రేక్షకుల దృష్టిని…

2 hours ago

దేశవ్యాప్తంగా 5G.. ఏ రేంజ్ లో ఉందంటే..

భారతదేశంలో 5G సేవలు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం, మొత్తం 776 జిల్లాల్లో…

3 hours ago

నా సినిమా సేఫ్ అంటున్న దర్శకుడు

‘మిర్చి’ సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ‘నా ఫ్యామిలీ సేఫ్’ అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో కొత్తగా చెప్పాల్సిన…

3 hours ago

బాబుతో నాగం భేటీ… ఎన్నెన్ని తీపి గురుతులో?

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడును గురువారం తెలంగాణకు చెందిన సీనియర్ మోస్ట్ రాజకీయ నేత, మాజీ మంత్రి…

4 hours ago

రెండో రోజే రచ్చ… బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై వేటు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండో రోజే రచ్చ చోటుచేసుకుంది. ఓ చిన్న వివాదం చిలికి చికిలి గాలి…

4 hours ago