అడివి శేష్ హీరోగా తెరకెక్కిన ‘హిట్ 2’ తొలి రోజే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో శేష్ కేరెక్టర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ క్లిక్ అవ్వడంతో ఫస్ట్ డే మంచి కలెక్షన్స్ అందుకుంది. ఓవర్ సీస్ లో కూడా అలవోకగా హాఫ్ మిలియన్ అందుకుంది. అయితే ఈ సినిమా సోమవారం గండం దాతుతుందా ? లేదా అనే సందేహం ట్రేడ్ వర్గాల్లో ఉన్నాయి. అవును ప్రస్తుతం ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో థియేటర్స్ కి రావడం లేదు. ఎంత టాక్ బాగున్నా కేవలం మూడు రోజులే ప్రేక్షకులు థియేటర్స్ లో కనిపిస్తున్న పరిస్థితి.
అంతెందుకు చిరంజీవి గాడ్ ఫాదర్ , సమంత యశోద సినిమాలు రిలీజ్ తర్వాత మూడు రోజులు మాత్రమే జోరు చూపించాయి. సోమవారం బాగా డ్రాప్ అయ్యాయి. లవ్ టుడే తమిళ్ డబ్బింగ్ కూడా ఇంతే వీకెండ్ మంచి వసూళ్ళు తెచ్చుకుంది. కానీ మండే నుండి కలెక్షన్స్ తగ్గాయి. ఈ మధ్య వచ్చిన సినిమాల్లో మసూద ఒక్కటే సోమవారం నుండి కలెక్షన్స్ పెంచుకుంది. పబ్లిక్ టాక్ తో ఈ హారర్ సినిమా చూసేందుకు నాలుగో రోజు నుండి ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మొదలు పెట్టారు.
మరి ఈ లెక్కన చూస్తే అడివి శేష్ హిట్2 కి సోమవారం ఆశించిన కలెక్షన్స్ వస్తాయా ? లేదా సినిమా డ్రాప్ అయ్యే అవకాశం ఉందా ? తెలియాలంటే మరికొన్ని గంటలు గడవాల్సిందే. సోమవారం మార్నింగ్ షో కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఫస్ట్ షో , సెకండ్ షో హౌజ్ 50 పర్సెంటేజ్ అక్యూపెంసీ వచ్చిన సినిమా నిలబడి నట్టే. ఏదేమైనా నిర్మాత నాని , ప్రశాంతి కి ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టింది. మిగతాదంతా బోనస్ అనే చెప్పాలి.
This post was last modified on December 5, 2022 3:29 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…