లాక్ డౌన్ వల్ల మొదలైన సినిమాలు ఆగిపోతే… ఈ కరోనా గోల సద్దుమణగిన తర్వాత కూడా తమ సినిమాలు ఎప్పటికి మొదలవుతాయో తెలియని చిత్రమైన సంకట స్థితిలో చాలామంది దర్శకులున్నారు. వారిలో త్రివిక్రమ్ లాంటి అగ్ర దర్శకుడు కూడా ఉండడం గమనార్హం.
ఎన్టీఆర్ తో సినిమా లాక్ చేసుకున్న త్రివిక్రమ్ కు అతనెప్పటికి అందుబాటులోకి వస్తాడనేది తెలీదు. ఈలోగా మరో సినిమా చేయడానికి కూడా వేరే స్టార్లు ఖాళీగా లేరు. హరీష్ శంకర్ కూడా తన తదుపరి సినిమా పవన్ తో ఫిక్సయ్యాడు. అది చేసే వరకు వేరే సినిమాలేవీ చేయకూడదని నిర్ణయించుకున్నాడు.
పవన్ వకీల్ సాబ్ పూర్తి చేయడంతో పాటు క్రిష్ సినిమా కూడా తిరిగి పట్టాలెక్కించాలి. మరి హరీష్ శంకర్ సినిమాకు ఎన్నాళ్ళ సమయం పడుతుందో? సైరా దర్శకుడు సురేందర్ కి పెద్ద హీరోలు అందుబాటులో లేరు. అందుకే మిడ్ రేంజ్ హీరోలతో అయినా సినిమా చేద్దామని చూస్తున్నాడు.
Gulte Telugu Telugu Political and Movie News Updates