చాలా తక్కువ సినిమాలతోనే తమిళ సినీ చరిత్రలోనే అత్యుత్తమ దర్శకుల్లో ఒకడిగా గుర్తింపు సంపాదించాడు బాలా. విక్రమ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ‘సేతు’తో పాటు నందా, పితామగన్, నాన్ కడవుల్, అవన్ ఇవన్, పరదేశి లాంటి చిత్రాలతో కోలీవుడ్లో కల్ట్ డైరెక్టర్ అనిపించుకున్నాడు బాలా. ఇందులో కమర్షియల్ సక్సెస్ అయిన సినిమాలు తక్కువే అయినా.. బాలాకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. కోలీవుడ్లో అందరూ ఆయన్ని అమితంగా గౌరవిస్తారు.
ఐతే గత కొన్నేళ్లలో బాలా బ్రాండు బాగా దెబ్బ తినేసింది. వరుస పరాజయాలకు తోడు ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘వర్మ’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. ఆ సినిమా ఫైనల్ కట్ చూసి బెంబేలెత్తిపోయిన నిర్మాత మొత్తం తీసి డస్ట్ బిన్‌లో పడేసి ‘అర్జున్ రెడ్డి’ అసిస్టెంట్ డైరెక్టర్ అయిన గిరీశయ్యను పెట్టి కొత్తగా ఆ సినిమాను పునర్నిర్మించడం బాలాకు పెద్ద అవమానమే.
ఆ దెబ్బ నుంచి కోలుకుని ‘వానమగన్’ అనే ప్రెస్టీజియస్ ప్రాజెక్టును ప్రకటించాడు బాలా. సూర్య హీరోగా ఈ సినిమా తెరకెక్కాల్సింది. ఐతే సినిమా ప్రకటించి నెలలు గడుస్తున్నా ఇది ముందుకు కదల్లేదు. మధ్యలో సూర్య ఈ చిత్రం నుంచి తప్పుకున్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు పక్కా అనుకున్నారు.
కానీ తీరా చూస్తే ఈ చిత్రం నుంచి ఇప్పుడు సూర్య తప్పుకున్న విషయాన్ని బాలానే అధికారికంగా ప్రకటించాడు. స్క్రిప్టులో మార్పుల వల్ల సూర్యకు ఈ సినిమా సూట్ కావట్లేదని, అందుకే అతను తప్పుకుంటున్నాడని, మరో హీరోతో ఈ సినిమా రూపొందిస్తానని బాలా ప్రకటించాడు. ఐతే తనకు నందా, పితామగన్ లాంటి క్లాసిక్స్ ఇచ్చిన కృతజ్ఞతతో కష్ట కాలంలో ఉన్న బాలాను సూర్య అయినా ఆదుకుంటాడనుకుంటే ఇలా తప్పుకున్నాడేంటి అని కోలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
This post was last modified on December 5, 2022 2:20 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…