ఆఖరికి లీకులే నిజమయ్యాయి. పవన్ కళ్యాణ్, సాహో ఫేమ్ సుజిత్ కలయికలో సినిమా అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. అది కూడా ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన డివివి బ్యానర్ కావడంతో అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఇటీవలే సుజిత్ పవన్ ని పర్సనల్ గా పలుమార్లు కలుసుకున్నాక దీనికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. దీంతో అభిమానునుల ఆనందం మాములుగా లేదు. పవన్ లుక్ రివీల్ చేయకపోయినా వెనుక నుంచి అతని ఇమేజ్ మీద జపాన్ భాషలో అగ్గి తుపాను వస్తోందని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం వైరల్ అవుతోంది.
దే కాల్ హిం ఓజి(OG) అనే లైన్ కూడా జోడించారు. అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అప్పుడే నిర్వచనాలు మొదలయ్యాయి. టాప్ టెక్నీషియన్ రవి కె చంద్రన్ ఛాయాగ్రహణ బాధ్యతలు నిర్వర్తించబోతున్నారు. మ్యాటర్ ఇక్కడితో అయిపోలేదు. దీని వెనుక పెద్ద కథే జరిగిందని ఇన్ సైడ్ టాక్. కొంత కాలం క్రితం డివివి దానయ్య చిరంజీవితో వెంకీ కుడుముల డైరెక్షన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. కానీ అది ముందుకు కదల్లేదు. ఫైనల్ వెర్షన్ సంతృప్తికరంగా రాకపోవడంతో డ్రాప్ అయ్యారని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి ఉలుకు పలుకు లేదు. దాని స్థానంలోనే దానయ్యకు ఇప్పుడీ కాంబో ఇచ్చారని వినికిడి.
అంతే కాదు లూసిఫర్ రీమేక్ కు ముందు సుజిత్ ను తీసుకుని తర్వాత వద్దన్న సంగతి తెలిసిందే. ఇంకో మెగా మూవీ ఇస్తామనే హామీ ఇచ్చి పంపేశారు. ఆ కమిట్ మెంట్ కూడా ఇప్పుడీ ఓజి ద్వారా నెరవేర్చారనే టాక్ ఉంది. అంటే వెంకీ కుడుములది వదులుకున్నందుకు దానయ్యకు, గాడ్ ఫాదర్ తప్పించినందుకు సుజిత్ కు ఇలా రెండు రకాలుగా న్యాయం జరిగిందన్న మాట. ఇవన్నీ ఆన్ రికార్డ్ మాటలు కాదు కానీ ధృవ టైపులో లింక్ చేసుకుని చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. బాలు, పంజా తర్వాత పవన్ ఫుల్ లెన్త్ గ్యాంగ్ స్టర్ గా మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు సుజిత్ తనని ఏ రేంజ్ లో చూపించబోతున్నాడో.
This post was last modified on December 4, 2022 11:35 am
కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ).. తాజాగా మరో ఉద్యమానికి తెరదీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ రాజీనామాకు…
హీరో అయ్యేందుకు ఏళ్ల పాటు శ్రమించేవారు కొందరైతే.. తాము చేసిన పనుల కారణంగా చూపిన ధైర్య సాహసాల కారణంగా రాత్రికి…
కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…
కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…
నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…
తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…