సినిమా చూస్తే మల్టీప్లెక్సుల్లో, రెనొవేట్ చేసిన సింగిల్ స్క్రీన్లలోనే చూడాలి అనే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోయింది. ఇంతకుముందు ఏ థియేటర్ అయితే ఏముంది వెళ్లామా సినిమా చూశామా అన్నట్లుండేది. కానీ ఇప్పుడు సౌండ్ సిస్టమ్, పిక్చర్ క్లారిటీ లాంటి సాంకేతిక విషయాలు చూసుకుని.. సరైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న థియేటర్లను ఎంచుకుని మరీ సినిమాలకు వెళ్తున్నారు ఆడియన్స్.
ఐతే గ్రామీణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో థియేటర్లే ఉండవు అంటే.. ఇక అక్కడ ఇలాంటి అనుభూతిని ఇచ్చే స్క్రీన్లను ఊహించగలమా? అక్కడ కోట్లు ఖర్చు పెట్టి థియేటర్లు కట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు కాబట్టి ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేయరు. కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా మల్టీప్లెక్సు అనుభూతిని ఇస్తూ. థియేటర్ల యాజమాన్యాలకు కూడా నష్టం రాకుండా, వయబుల్ అనిపించేలా అవకావం ఇస్తోంది ‘ఇగ్లూ థియేటర్’.
మంచు ప్రాంతాల్లో ఎస్కిమోలు నిర్మించే ఇగ్లూ ఇళ్ల తరహాలో అర ఎకరం విస్తీర్ణంలో ఉత్తర తెలంగాణలోని రాజారాం పల్లిలో ఈ ఇగ్లూ థియేటర్‌ను నిర్మించారు. 100 సీట్ల సామర్థ్యం, 42 విస్తీర్ణంలో థియేటర్ ఆడిటోరియం నిర్మితమైంది. దీనికి అనుబంధంగా క్యాంటీన్, వాష్ రూమ్స్, టికెట్ కౌంటర్ ఉన్నాయి. థియేటర్ చిన్నదన్న మాటే కానీ.. స్క్రీన్ పెద్దది. పిక్చర్ క్లారిటీ, సౌండ్ సిస్టమ్ మల్టీప్లెక్స్‌లకు దీటుగా తీర్చిదిద్దారు. చిన్న థియేటర్లో పెద్ద స్క్రీన్ కావడంతో 70 ఎంఎం థియేటర్లో సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. సీటింగ్, ఏసీలు అన్నీ కూడా రెగ్యులర్ థియేటర్లకు దీటుగా ఏర్పాటు చేశారు. ఒక మల్టీప్లెక్సులో కూర్చుని సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుండడంతో చుట్టు పక్కల ప్రాంతాల వారు ఈ థియేటర్‌ను బాగానే ఆదరిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో నలుగురు భాగస్వాములు కలిసి ఈ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనంతపురం, ఖమ్మం జిల్లాల్లో ఇలాంటి థియేటర్లు రెండు ఏర్పాటయ్యాయి. మహారాష్ట్రకు చెందిన ‘ఛోటా మహారాజ్’ అనే సంస్థ చిన్న టౌన్లు, గ్రామాల కోసం ఈ థియేటర్లను డిజైన్ చేసింది. వారి నుంచి ఫ్రాంఛైజీ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో ఈ థియేటర్లు ఏర్పాటయ్యాయి. ఇవి సక్సెస్ అయితే మున్ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఇగ్లు థియేటర్లు మరిన్ని ఏర్పాటయ్యే అవకాశముంది.
This post was last modified on December 4, 2022 8:20 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…