గత నెల రోజులుగా కూసింత డ్రైగా ఉన్న టాలీవుడ్ బాక్సాఫీస్ కు హిట్ ది సెకండ్ కేస్ ఉత్సాహం తెచ్చేసింది. నవంబర్ నెలలో యశోద, మసూదలు బాగానే ఆడినప్పటికీ ఎక్కువ సెంటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు పడేంత రేంజ్ లో వెళ్ళలేదు. థియేట్రికల్ బిజినెస్ ని రీజనబుల్ గా చేయడం వల్ల బయ్యర్లకు మంచి లాభాలొచ్చాయి. లవ్ టుడే జోరు వారానికే పరిమితమయ్యింది. యూత్ లో వచ్చిన పాజిటివ్ టాక్ ని నిలబెట్టుకునేలా ప్రమోషన్లు చేయకపోవడంతో సెకండ్ వీక్ కి జనం లైట్ తీసుకున్నారు. దానికి తోడు తమిళ వెర్షన్ అఫీషియల్ స్ట్రీమింగ్ నెట్ ఫ్లిక్స్ లో వచ్చేశాక ఇదింకా తగ్గింది.
అందుకే రిలీజ్ కు ముందు నుంచే ఒకరకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ హిట్ 2 విషయంలో కనిపించాయి. వాటిని నిలబెట్టుకుంటూ పాజిటివ్ రివ్యూలతో పాటు పబ్లిక్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వడంతో ఒక్కసారిగా బుకింగ్స్ ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో మార్నింగ్ షోలకు కౌంటర్ల దగ్గర కొనే పరిస్థితి నుంచి రాత్రి సెకండ్ షోలకు గంట ముందే దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయ్యేదాకా ఒక్కసారిగా సీన్ మారిపోయింది. జిల్లా కేంద్రాల్లో అదనపు షోలు జోడించినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ ఉన్నాయి. సైకో కిల్లింగ్ కథలు కొత్తేమి కాకపోయినా దర్శకుడు శైలేష్ కొలను టేకింగ్ దీన్ని గట్టిగా నిలబెట్టింది.
వచ్చే వారం 9న రాబోతున్న వాటిలో హైప్ ఉన్నవేవీ పెద్దగా లేవు. సో హిట్ 2 కి మళ్ళీ అవతార్ 2 వచ్చే దాకా బ్రేకులు పడే ఛాన్స్ లేదు. అడవి శేష్ ఇమేజ్ తో పాటు హిట్ కు నిర్మాత నాని తీసుకొచ్చిన బ్రాండ్ ఇమేజ్ అంచనాలను పెంచుకుంటూ పోతున్నాయి. మొదటి రోజే ఆరు కోట్లకు పైగా షేర్ వచ్చిందన్న సమాచారం డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్ కి కిక్ ఇచ్చింది. ఒకవేళ సోమవారం నుంచి వీక్ డేస్ లో ఎక్కువ డ్రాప్ లేకుండా మైంటైన్ చేయగలిగితే హిట్ 1ని మించిన సక్సెస్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కిల్లర్ లీక్స్ ని స్పాయిల్ చేయకుండా సోషల్ మీడియా ఇస్తున్న మద్దతు కూడా బాగుంది