జూబ్లీ హిల్స్ ఏంటి. అందులో ప్రభాస్ ఫాం హౌస్ ఏంటి.. అది 84 ఎకరాల్లో ఉండడం ఏంటి.. అని ఆశ్చర్యం కలుగుతోందా? టైమ్స్ నౌ అలాంటి ప్రముఖ పత్రిక ఈ మేరకు ఒక కథనం ప్రచురంచేసింది. లోపల మేటర్లో తెలియకుండా పొరబాటున ఇలా రాసేశారు అనుుకంటే తప్పులో కాలేసినట్లే. చక్కగా Prabhas’ lavish Jubilee Hills farmhouse spread over 84 acres oozes Adipurush actor’s simple taste అని పెద్ద హెడ్డింగ్ పెట్టి మరీ ఈ స్టోరీని పబ్లిష్ చేయడం విశేషం.
ఇంగ్లిష్ మీడియా సెలబ్రెటీల గురించి.. ముఖ్యంగా సౌత్ వాళ్ల గురంచి కథనాలు ప్రచురించేటపుడు ఏమాత్రం గ్రౌండ్ వర్క్ చేస్తుంది.. ఎంత నిర్లక్ష్యంగా కథనాలు వండి వారుస్తుంది చెప్పడానికి ఇది ఉదాహరణ. హైదరాబాద్ సిటీలో మోస్ట్ పోష్ ఏరియాల్లో ఒకటైన జూబ్లీ హిల్స్‌లో 84 ఎకరాల ఫాం హౌస్ అని రాయడం అంటే ఇంగ్లిష్ జర్నలిస్టులు ఎంత అవగాహన లేమితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.. అతడి పట్ల ఉత్తరాది జనాల్లో కూడా ఆసక్తి ఉంది.. సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలపై మరింత క్యూరియాసిటీ ఉంటుంది కాబట్టి ఎక్కడో ఢిల్లీలోనో, ముంబయిలోనో కూర్చుని హైదరాబాద్ గురించి కనీస అవగాహన లేకుండా ఈ స్టోరీ రాసినట్లున్నారు. కనీసం హైదరాబాద్‌తో టచ్ ఉన్న ఎవరితోనూ క్రాస్ చెక్ చేయించినట్లు లేరు.
పైగా ఈ కథనంలో ‘రాధేశ్యామ్’ సినిమాలోని దృశ్యాన్ని వాడుకున్నారు. ఈ స్టోరీ చూసి ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ టైమ్స్ నౌ వాళ్లకు గట్టిగా గడ్డి పెట్టాడు. జూబ్లీ హిల్స్‌లో 84 ఎకరాలంటే ఏంటో వీళ్లకసలు తెలుసా? ఏదో ఒక చెత్త రాసి, దానికి ఏదో ఒక సెలబ్రెటీ పేరును తగిలించేస్తారంటూ ఆయన మండిపడ్డారు. ఈ కథనంపై ప్రస్తుతం ప్రభాస్‌తో సినిమా చేస్తున్న మారుతి సైతం స్పందించి కౌంటర్ వేశాడు. ఐతే శోభు ఇలా స్పందించాక కూడా ఆ కథనాన్ని డెలీట్ చేయకుండా అలాగే కొనసాగిస్తుండడం విశేషం.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు హోరాహోరీగా జరుగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కేజ్రీవాల్ జోరుకు బ్రేకులు వేయాలని బీజేపీ భావిస్తోంది.…
వైసీపీ నేతలు, కార్యకర్తల వెంట్రుక కూడా పీకలేరు అంటూ మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా…
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…