తమిళంలో ఇప్పుడు విజయే నంబర్ వన్ హీరో అనడంలో మరో మాట లేదు. చాలా ఏళ్ల పాటు కోలీవుడ్లో సూపర్ స్టార్ రజినీకాంత్ హవానే నడిచినా.. గత దశాబ్ద కాలంలో ఆయన డౌన్ అవుతూ వచ్చారు. అదే సమయంలో విజయ్ పైపైకి ఎదిగిపోయాడు. అతడి సినిమాల బిజినెస్, కలెక్షన్లు వేరే లెవెల్‌కు వెళ్లిపోయాయి. విజయ్ సినిమాలు కొన్ని యావరేజ్ కంటెంట్‌తో 150-200 కోట్ల మేర వసూళ్లు సాధించాయంటే అక్కడ తన రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కానీ తెలుగులో మాత్రం విజయ్ రేంజ్ చాలా తక్కువ. చాలామంది తమిళ స్టార్లలా ఇక్కడ అతను ఫాలోయింగ్ సంపాదంచుకోలేకపోయాడు. పదేళ్ల ముందయితే విజయ్‌ని, అతడి డబ్బింగ్ సినిమాలను మన ప్రేక్షకులు అసలేమాత్రం పట్టించుకునేవారు కాదు. కానీ తుపాకి, జిల్లా, అదిరింది, బిగిల్, మాస్టర్ లాంటి చిత్రాలతో గత దశాబ్ద కాలంలో తెలుగులో కొంత గుర్తింపు, మార్కెట్ సంపాదించాడు.
ఐతే తెలుగులో ఎన్ని హిట్లు పడ్డా విజయ్ మార్కెట్ పది కోట్లకు అయితే మించే పరిస్థితి లేదు. ఇప్పుడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు.. విజయ్‌తో ‘వారిసు’ అనే సినిమా తీస్తున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ‘వారసుడు’ పేరుతో తెలుగులోనూ రిలీజవుతోంది. ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయిస్తుండడంపై కొన్ని రోజులుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ గొడవ నడుస్తున్న టైంలో విజయ్ సినిమాల్లోకి వచ్చి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అతడి హిట్ చిత్రాల్లో ఒకటైన ‘అదిరింది’కి హైదరాబాద్‌లో స్పెషల్ షో వేస్తుండడం గమనార్హం. ఇలాంటి స్పెషల్ షోలు ఆయా భాషల్లో స్టార్ హీరోలకు వేస్తుంటారు. తెలుగులో ఇటీవల ఇలాంటి షోల హడావుడి పెరిగిన మాట వాస్తవమే. కానీ విజయ్‌కి తెలుగులో ఫ్యాన్స్ ఉన్నారని, వాళ్ల కోసం స్పెషల్ షో వేస్తున్నామని చెబితే ఎవరికైనా నవ్వు వస్తుంది. విజయ్ సినిమాలు బాగుంటే ఇక్కడ ఓ మోస్తరుగా ఆడతాయేమో కానీ.. అతడికి డైహార్డ్ ఫ్యాన్స్ ఉండడం, వాళ్లు స్పెషల్ షోలను సెలబ్రేట్ చేయడం అన్నది కామెడీగానే అనిపిస్తుంది. బహుశా ‘వారసుడు’ విడుదలకు ముందు విజయ్‌కి తెలుగులో క్రేజ్ ఉందని చూపించే ప్రయత్నంలా ఉంది ఈ స్పెషల్ షో వ్యవహారం.
This post was last modified on December 1, 2022 2:25 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…